సెప్టెంబర్ 13న జరగబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ ‘వాల్మీకి’ సినిమాల మధ్య పోటీ నానీ వరుణ్ తేజ్ ల మధ్య ఇగో వార్ గా మారడంతో ఈ వార్ తప్పదు అని అందరూ అనుకున్నారు. దీనికితోడు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ను నాని ఉపయోగించు కోవడం పై మెగా అభిమానులు అంతా తీవ్ర అసహనంలో ఉన్న నేపధ్యంలో ఈ వార్ తప్పదు అని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. 

వాస్తవానికి ఈ రేసు నుండి మెగా అభిమానులకు కోపం రాకుండా నాని వెనకడుగు వేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈ వార్ నుండి వరుణ్ తేజ్ వెనకడుగు వేసి తన ‘వాల్మీకి’ మూవీని వచ్చేనెల 20న విడుదల చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం దిల్ రాజ్ చేసిన రాయబారాలు అని అంటున్నారు. రెండు మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి విడుదల అయితే రెండు సినిమాలకు నష్టం అని చెపుతూ ధియేటర్ల సమస్య కూడ ఏర్పడుతుందని దిల్ రాజ్ అల్లు అరవింద్ తో చేసిన రాయబారాలతో వరుణ్ తేజ్ ఒక వారం వెనక్కు వెళ్ళడానికి అంగీకరించాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావడానికి మరికొన్ని రోజులు పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. మొదట్లో మెగా అభిమానుల తలనొప్పికి భయపడి వెనక్కు వెళతాడు అనుకున్న నాని తిరిగి యూటర్న్ తీసుకుని నిన్న ‘గ్యాంగ్ లీడర్’ కోసం మీడియా మీట్ పెట్టడమే కాకుండా ఈ మూవీని చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ కు అంకితంగా విడుదల చేస్తున్నాను అని చెప్పడంతో అల్లు అరవింద్ మెత్తపడి వరుణ్ తేజ్ ను ఒప్పించి ఉంటాడు అన్న ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: