ప్రముఖ బాలీవుడ్ తార విద్యాబాలన్ తెలుగు వారికి సుపరిచితామే.ఆమె తెలుగులో వ్యాంప్ పాత్రలు వేసిన సిల్క్ స్మిత బయెపిక్ "థి డర్టి పిక్చర్" లో కథనాయిక గా నటించింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటీ అవార్డు ఆమెను వరించింది. రీసెంట్ గా విద్యాబాలన్ NTR కథానాయకుడు లో బసవ తారకం పాత్రలో కనిపించారు.ఇది ఆమెకు తెలుగులో మొదటి సినిమా
.
విద్యాబాలన్   రెండు సంవత్సరాల విరామం తర్వాత "మిషన్ మాంగల్" సినిమాలో నటించింది. ఆగస్టు 15 న విడుదల అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దాదాపు 150 కోట్ల మార్క్ ను దాటి 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తన జీవతంలో జరిగిన  చెడు సంఘటలను గుర్తుచేసుకున్నారు.

మా అమ్మ-నాన్న సొంత  ఊరు బెంగుళూర్ కాబట్టి తన కెరియర్ మొదట్లో సౌత్ లో హీరోయిన్ ప్రయాత్నలు చేసాను. ఒక తమిళ నిర్మాత ఆయన సినిమా నుండి నన్ను హీరోయిన్ పాత్ర నుండి తోలిగించారు.నేను మా నాన్న ఎందుకు అలా చేసారని అడగడానికి వెళ్లాం. ఆయన నన్ను నువ్వు హీరోయిన్ మెటిరియల్ కానేకాదు అని దారుణంగా అవమానించాడు. కొన్ని నెలలు  అద్దంలో నా మొహం చూసుకోవడానికి భయపడ్డాను.ఎందుకంటే నేను అందం గా లేనని.ఆయనను నా జీవితంలో క్షమించాను. 


కొన్ని రోజుల తరువాత ఒక తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను ఫోన్ లోనే ఒప్పుకున్నాను.  సినిమా సెట్ కు వెళ్లాను,  మొదటి రోజు షూటింగ్ అయ్యింది కానీ ఆ నిర్మాత ప్రతీ సరి నా దగ్గరికి వచ్చి జోకులు వేయడం మరియు నాతో   ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. నెక్ట్స్ డే సినిమా నుండి బయటికి వచ్చాను.ఆ తరువాత ఆ నిర్మాత నాకు లీగల్ నోటిసులు పంపాడు అని చెప్పింది


మరింత సమాచారం తెలుసుకోండి: