పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతీ రోజు వార్తలను చూస్తున్నాం. ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా  పర్యావరణాన్ని కాపాడాలని, అందుకు తగు విధంగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం. అయితే ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పర్యావరణాన్ని పాడు చేస్తున్న దానిలో ముఖ్యంగా ప్లాస్టిక్ ఒకటి. ప్లాస్టిక్ ని అరికట్టాలని, యూసేజ్ తగ్గించాలని చాలా రోజుల నుండి చాలా మంది అంటున్నారు.


అయితే ప్రస్తుతం ప్రధాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మానేయాలని చెప్పారు. అయితే ప్రధాని  చెప్పింది సరైనదంటూ ఆమీర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్ట్‌ చేశాడు."సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అరికట్టడానికి గౌరవనీయులైన ప్రధాని చొరవ మనమందరం బలంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం మానేయాలనే నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత." అని వ్యాఖ్యానించారు. 


ఆదివారం ప్రసారమైన మన్ కి బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ అక్టోబర్ 2 నుండి (మహాత్మా గాంధీ జన్మదినం) "ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా కొత్త విప్లవం" ప్రారంభించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. "ఈ సంవత్సరం, మనం బాపూజీ 150 వ జయంతిని జరుపుకునేటప్పుడు, బహిరంగ మలవిసర్జన రహితమైన భారతదేశాన్ని ఆయనకు అంకితం చేయడమే కాకుండా, ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా కొత్త విప్లవానికి పునాది వేద్దాం.


ప్లాస్టిక్ రహిత మదర్ ఇండియా గుర్తుగా ఈ సంవత్సరం గాంధీ జయంతిని జరుపుకుందాం. అక్టోబర్ 2 ను ప్రత్యేక దినంగా జరుపుకుందాం" అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి విజ్ఞప్తి చేశారు. "దుకాణదారులు జనపనార, గుడ్డ సంచులను అమ్మాలి. వినియోగదారులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే మార్గాలను అవలంబించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడాలి" అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: