మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విజయశాంతితో కలిసి అనేక సినిమాలు చేశారు.  అందులో చాలా సినిమాలు మెగా హిట్ అయ్యాయి.   వీరిద్దరూ కలిసి చేసిన చివరి సినిమా మెకానిక్ అల్లుడు.  ఆ సినిమా తరువాత ఇద్దరు కలిసి పనిచేయలేదు.  గత 13 సంవత్సరాలుగా విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటున్నది.  రీసెంట్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.  


ఇందులో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నది.  ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లో నటిస్తోంది విజయశాంతి.  ఇప్పుడు విజయశాంతితో కలిసి మెగాస్టార్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  సైరా తరువాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతున్నది.  ఇందులో కాజల్ హీరోయిన్.  


అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నది.  ఇదిలా ఉంటె, ఈ మూవీద్వారా మరలా మెగాస్టార్ చిరంజీవి.. విజయశాంతిలు కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయశాంతి కూడా నటించబోతున్నట్టు సమాచారం.  విజయశాంతి కోసం ఓ కీలక పాత్రను శివ సృష్టిస్తున్నారని తెలుస్తోంది.  


అయితే, ఇవి కేవలం పుకార్లే అని నిజంగా శివ.. విజయశాంతిని కలవలేదని.. ఆ దిశగా శివ ఇంకా ఆలోచించలేదని తెలుస్తోంది.  అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే శివ విజయశాంతిని కలిసి ఈ విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 


సైరా సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా ప్రారంభం అవుతుంది.  మెగాస్టార్ ప్రస్తుతం సైరా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  ఈ సినిమాకోసం మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  సినిమా తప్పకుండా భారీ వసూళ్లు సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  బాహుబలి రికార్డులను ఈ సినిమా బీట్ చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: