బిగ్ బాస్ తెలుగులో ఇంతకుముందు సీజన్లలో ఎన్నడూ లేని విధంగా నిర్వాహకులు మొదటిసారి ఒక పెళ్లి అయిన జంటను హౌస్ లోపలికి పంపించారు. వారే వరుణ్ సందేశ్ మరియు అతని భార్య అయిన వితిక సేర్. వారిద్దరూ లోపలికి వెళితే వీరిద్దరి మద్య చిలిపి గొడవలు.. రొమాన్స్ తో బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారని షో నిర్వాహకులు అనుకున్నారు. అయితే షో మొదలయ్యి ఐదు వారాలు అవుతున్నా బిగ్ బాస్ ఊహించిన స్థాయిలో అయితే అక్కడ ఏమీ జరగలేదు. చిన్న చిన్న గొడవలు వీరిద్దరి మధ్య జరగడం.... అవి కూడా వెంటనే మాటలతో సద్దుమనగడం కూడా కామన్ అయిపోయింది.

అయితే మరి కొద్ది గంటల్లో ప్రసారమయ్యే ఈరోజుటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని బిగ్ బాస్ నిర్వాహకులు తమ సోషల్ మీడియా వెబ్ సైట్ లలో వదిలారు. అందులో వరుణ్ మరియు వితికా తీవ్రస్థాయిలో వాదనకు దిగడం మనం చూడొచ్చు. వితికా వరుణ్ తో మాట్లాడటం తనకు ఇష్టం లేదు అని చెప్పడంతో వరుణ్ కోపంతో అయితే ఇంట్లో ఉండకు వెళ్ళిపో అని అనడం మనం చూడొచ్చు. ఏమైందో ఏమో కానీ అతను వితికా తో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వితికా ఏంటి అని అడగగా అతను కోపంతో ఆమె మొహం మీద కాఫీ విసిరేయడం కూడా మనం ఆ క్లిప్పింగ్ లో చూడొచ్చు. ఎప్పుడూ హౌస్ లో సూపర్ కూల్ గా ఉండే వరుణ్ సందేశ్ ఇంత వైలెంట్ గా మారడానికి కారణమేంటి?

బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి వరుణ్ సందేశ్ కు ఇంటిలో మరియు ప్రేక్షకులలో చాలా మంచి పేరు ఉన్నా వితిక మాత్రం ఎప్పుడూ నెగిటివ్ గానే ప్రవర్తించింది. ఇందువల్లే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తడంతో వితిక చీటికిమాటికి అలగడం వరుణ్ వెంటనే వెళ్లి క్షమాపణలు చెప్పడంతో అప్పటికప్పుడు అంతా సద్దుమణిగింది. అయితే బయటకు వెళ్ళి పోతున్న కంటెస్టెంట్స్ తో పాటు ఇంట్లో ఉన్న వారు కూడా బిజీగా ఉండటంవల్ల వరుణ్ సందేశ్ తన గేమ్ సరిగ్గా ఆడలేక పోతున్నాడు అని చెప్పడాన్ని వరుణ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు.

మరికొన్ని సందర్భాల్లో వితిక చేసింది తప్పు అని వరుణ్ ఆమె బదులుగా మిగతా కంటేస్టంట్స్ ను సపోర్ట్ చేయడం కూడా వితికకు చాలా సార్లు బాధ అనిపించింది. ఎంత భర్త అయినా తనకంటూ ఒక నిర్ణయం ఉంటుందని కేవలం భార్య అనే నెపంతో సపోర్ట్ చేయాలేనని వరుణ్ చాలాసార్లు చెప్పడం కూడా మనం ఇప్పటికే చూశాం. ఇదిలా ఉండగా ఈరోజుటి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక విషయంలో వరుణ్ వితిక తో  వ్యతిరేకిస్తే ఆమె అలగడంతో అతని కోపం తారాస్థాయికి చేరి కాఫీ ముఖం మీద కొట్టినట్లు ఉన్నాడు. అంటే నేరుగా ముఖం మీద కాదండోయ్ ఆమె పక్కనే ఉన్న గ్లాస్ కు కాఫీని విసిరేశాడు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన గొడవ మరియు తర్వాత జరిగే పరిణామాలు కోసం ఈరోజు రాత్రి జరిగే ఎపిసోడ్ తప్పక చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: