టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళ్ లో బాబీ సింహ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా త్రకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి అచంటలు నిర్మాతలుగా నిర్మితం అవుతున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావడం జరిగింది. అలానే ఆ తరువాత రిలీజ్ అయిన జర్ర జర్ర సాంగ్ కు మాస్ ఆడియన్స్, 

మెగా ఫ్యాన్స్ నుండి స్పందన అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అంతేకాక ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో వాల్మీకి టీమ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేద్దాం అని భావించారు. అయితే కొద్దిరోజల క్రితం నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ సినేమాను కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేయడంతో, వాల్మీకి సినిమా నిర్మాతలు కొంత డైలమాలో పడ్డారు. అయితే నిన్న, ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్య కుదిరి అదే రోజున ముందుగా గ్యాంగ్ లీడర్ రిలీజ్ చేసి, అలానే ఒక వారం ముందుకు జరిపి వాల్మీకిని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 

ఈ మేరకు కాసేపటి క్రితం వాల్మీకి చిత్ర నిర్మాతలు తమ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఒకరకంగా మంచి పరిణామమని, ఈ విధంగా రెండు సినిమాల నిర్మాతలు సయోధ్యతో చర్చించి ఈ రెండు సినిమాలు క్లాష్ కాకుండా మంచి నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని, అలానే భవిష్యత్తులో కూడా ఇతర పెద్ద సినిమాల రిలీజ్ ల విషయంలో కూడా ఆయా సినిమాల నిర్మాతలు కూడా ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నామని అంటున్నారు సినీ విశ్లేషకులు .....!!


మరింత సమాచారం తెలుసుకోండి: