కాలం కలిసి వస్తే .. ఒక్క సినిమా హిట్ కొట్టారు అంటే ఆ సినిమా హీరోయిన్ చేతిలో పది సినిమాలు ఉంటాయి. కానీ కథ అడ్డం తిరిగింది అంటే మాత్రం ఎన్ని సినిమాలు హిట్ కొట్టిన ఆ హీరోయిన్ ని హెరాయిన్ గా తీసుకోవాలి అని అనుకోరో. అలానే షాలిని పాండేని తెలుగు ఇండస్ట్రీ వాళ్లు పక్కన పెట్టేశారు అని చెప్పచు. తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి.                                                             


అన్ని ఇండస్ట్రీల్లో రీమేక్ అవుతున్నా ఈ చిత్రం హీరోయిన్ కి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ అంటే చాలా తక్కువ వచ్చాయి. దీంతో ఆమె త‌మిళ్ వైపు వెళ్లి తమిళ్ లో తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం తమిళ్ లో ఆమె మూడు సినిమాల్లో న‌టిస్తోంది. తెలుగులో అనుష్క 'సైలెన్స్'లో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది కాక స్వ‌ప్న ద‌త్ చిత్రంలో న‌టిస్తోంద‌ని వార్త‌లొచ్చాయి.                                               


కానీ ఇప్పుడు స్వ‌ప్న‌ద‌త్ సినిమాలో షాలిని పాండేని వద్దు అని పంపించేసారట. ఆమె స్థానంలో లోక‌ల్ అమ్మాయి ఫారియా అబ్దుల్లాను తీసుకున్నారట. సినిమాలో ఫ్రెష్ ఫేస్ ఉండాల‌ని ఫారియాను తీసుకున్న‌ట్టు యూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, రాహుల్ రామ‌కృష్ణ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాకు పిట్ట‌గోడ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు.                                     


మరింత సమాచారం తెలుసుకోండి: