స్వీట్ గా కనిపిస్తూ హాట్ అందాలను వొలక బోస్తూ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రభాస్ స్వీటీగా ఉండే అనుష్క శెట్టి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనుందట. ఇంతవరుకు ఒక్క సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించని స్వీటీ ఇప్పుడు పవన్ కళ్యానికి సర్ప్రైజ్ ఇవ్వనుందా ? అని మీరు అనుకోవచ్చు కానీ సర్ప్రైజ్ ఇస్తుందండి అనుష్క. 


అనుష్క‌, మాధ‌వ‌న్‌, అంజ‌లి ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా 'సైలెన్స్'. తెలుగులో 'నిశ్శ‌బ్దం' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. మొన్న ఈ మధ్యే అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్ల‌యినందుకు అభినంద‌న‌లు చెబుతూ సైలెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా సర్ప్రైజ్ ఇస్తూ విడుదల చేయనున్నారట. 


హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టి.జి.విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ నిర్మాతలు. షాలిని పాండే ఈ సినిమా కీల‌క పాత్ర‌లో నటించిందట. షానిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటో గ్రాఫ‌ర్‌గా వ్య‌వహ‌రిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు విడుదల చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


మరికొందరు ఈ టీజర్ రిలీజ్ పై మాటాడుతూ ఒకవేళ సెప్టెంబర్ రెండు, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు విడుదల చేసిన అది పవన్ కళ్యాణ్ కోసం కాదు. ఆరోజు వినాయచవతి పండుగ అందేకే విడుదల చేస్తారు అని మరికొందరు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా సెప్టెంబర్ రెండు టీజర్ రిలీజ్ అవుతే పవన్ కళ్యాణ్ కోసమని అనుకుంటాం అని అంటున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: