టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఈ పేరు వినగానే కాస్టింగ్ కౌచ్ గుర్తుకు వస్తుంది.  టాలీవుడ్ లో ఎంతో మంది అమాయక అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కి గురి అవుతున్నారని దళారుల చేతుల్లో మోసపోతున్నారని సంచలన ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. కేవలం ఆరోపణలు మాత్రమే కాదు అలాంటి నిర్మూలించాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది.  ప్రతిరోజూ ఏదో ఒక చానల్ లో ఇంటర్వ్యూలో ఇస్తూ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ విద్యార్థి సంఘం, మహిళా సంఘం మద్దతు కూడగట్టుకొని ఆ సమయంలో మహిళా ఉద్యమనాయకురాలిగా మారింది. 

అదే సమయంలో నటుడు, జనసే అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై ఆయన కుటుంబంపై అభ్యంతరకర మాటలు మాట్లాడటంతో ఆమెపై ఒక్కసారే విమర్శలు మొదలయ్యాయి. పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం వారికి బదులుగు శ్రీరెడ్డి హాట్ గా కామెంట్ చేయడం ఇలా కొంత కాలం సోషల్ మీడియా యుద్దం నడిచింది.  ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటున్నారు.  కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు ఇటీవల పేర్కొంది.  అలాగే ఆమె సొంత యూట్యూబ్ రన్ చేస్తుంన్నట్లు ప్రకటించింది. తాజాగా బిగ్ బాస్ 3 పై సంచలన కామెంట్ చేసింది.

బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ ఇస్తామని తనను సంప్రదించారని.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర గోల్కొండ హోటల్ కి తనను రామ్మన్నట్లు చెప్పింది.   అక్కడ అభిషేక్ అనే వ్యక్తి తనను కలిశాడని ఆ సమయంలో అతని చూపులో ఏదో తేడా కనిపించిందని, బిగ్ బాస్ లో మీ ఎంట్రీ తర్వాత ఏం చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఒకవేళ ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకుంటారా? అలాగే దుప్పట్లో ఎవ్వరికీ కనిపించకుండా సెక్స్ చేస్తారా అంటూ అసభ్యంగా మాట్లాడి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడని చెబుతుంది శ్రీరెడ్డి. అయితే అతడు సరదాగా అంటున్నాడేమోనని సిగ్గులేకుండా సెక్స్ చేసే టైప్ కాదని నవ్వుతూనే సమాధానం చెప్పినట్లు  వెల్లడించింది. 

తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తే చిన్న చిన్న బట్టలు వేసుకొని సెక్సీ లుక్స్ తో కనిపిస్తావా అని అడిగినట్టు చెప్పింది. చివరగా తనకు ఛాన్స్ ఇస్తే కమిట్ మెంట్ ఇస్తావా అని అడగడంతో వాడి పరిస్థితి పూర్తిగా అర్థమై..తనకు బిగ్ బాస్ లో ఉండాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పినట్లు శ్రీరెడ్డి అన్నారు. అయితే గత కొంత కాలంగా బిగ్ బాస్ 3 పై ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే..ఇది ఎంత వరకు నిజం అన్న విషయం మాత్రం ఆ పెరమాళకెరుక.


మరింత సమాచారం తెలుసుకోండి: