బాహుబ‌లి సీరిస్ సినిమాలు, సాహో ఎఫెక్ట్‌తో ఆల్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. ప్ర‌స్తుతం దేశం అంతా సాహో నామ‌స్మ‌ర‌ణ చేస్తోంది. ప్రభాస్‌కు వ‌చ్చిన ఈ స్టార్‌డ‌మ్ ఎంత వ‌ర‌కు నిల‌బ‌డుతుంది ? అన్న‌ది సాహో రిజ‌ల్ట్ చెపుతుంది. బాహుబ‌లి రెండు భాగాల‌కు క‌లిపి ప్ర‌భాస్‌కు ఎంత ఇచ్చారో ఆ సినిమా నిర్మాత‌ల‌కే తెలియాలి. కొంద‌రు రూ.20 కోట్ల పైనే అని చెపుతారు. ప్ర‌భాస్ స‌న్నిహితుల టాక్ ప్ర‌కారం కేవ‌లం రూ.12 కోట్లే అని మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై ఆయ‌న సంతృప్తిగానే ఉన్నా... ఆయ‌న స‌న్నిహితులు మాత్రం ఫీల్ అయ్యార‌ని అప్పుడు టాక్ వ‌చ్చింది. 


ఇక ఇప్పుడు సాహో ప్ర‌భాస్ హోం బ్యాన‌ర్‌లో వ‌స్తోంది. సాహో నిర్మాత‌లు ప్ర‌మోద్‌, వంశీ, ప్రభాస్ అంతా స‌న్నిహితులే అన్న‌ది తెలిసిందే. దీంతో ఈ సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంత‌న్న‌ది బ‌య‌ట‌కు రాదు. ఈ సినిమా బ‌డ్జెట్‌, ప్రి రిలీజ్ బిజినెస్‌, లాభాల‌ను బ‌ట్టి ప్ర‌భాస్‌కు వాటా ఇవ్వ‌వ‌చ్చు. అలాంట‌ప్పుడు సాహోతో కూడా ప్ర‌భాస్ ఒరిజిన‌ల్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌న్న‌ది బ‌య‌ట‌కు రాదు. నేష‌న‌ల్ మీడియా మాత్రం బాహుబ‌లి, సాహో నేప‌థ్యంలో ప్రభాస్ మీడియాపై చ‌ర్చ‌లు న‌డుపుతోంది.


సాహో త‌ర్వాత ప్ర‌భాస్ కొత్త బ్యాన‌ర్లో సినిమా చేస్తే వ‌చ్చే రెమ్యున‌రేష‌న్ ప్ర‌భాస్ ఒరిజిన‌ల్ రెమ్యున‌రేష‌న్ అవుతుంది. అది ఎంతో తేలాలంటే సాహో రిజ‌ల్ట్‌, వ‌సూళ్ల‌ను బ‌ట్టే ఆధార‌ప‌డి ఉంటుంది. సాహో ఏ రూ.300 కోట్లో రాబ‌డితే అప్పుడు ప్ర‌భాస్‌తో ఏ బాలీవుడ్ వాళ్లో సినిమా చేస్తే అప్పుడు ప్రభాస్ సులువుగానే రూ.70-80 కోట్ల రెమ్యున‌రేష‌న్ రేంజ్‌కు వెళ్లిపోతాడు. 


ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్ రూ.50 కోట్ల‌తో టాప్ ప్లేసులో ఉన్నాడు. అప్పుడు ప్ర‌భాస్ వీళ్ల‌ను దాటి చాలా ముందుకు వెళ్లిపోతాడు. సో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ పెర‌గాల‌న్నా.. అత‌డి స్డార్‌డ‌మ్ నిల‌బ‌డాల‌న్నా సాహో రిజ‌ల్ట్ మీదే ఆధార‌ప‌డి ఉంది. మ‌రి సాహో ఏం చేస్తాడో ?  చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: