యంగ్ రెబల్ స్టార్  ప్ర‌భాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం 'సాహో'.  కాగా  అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి  రోజుకి ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని  ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.  అయితే ఈ విజ్ఞప్తి మేరకు  ఏపీ ప్రభుత్వం  ఆరు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి  ఇస్తూ ఒక జివోని కూడా రిలీజ్ చేసింది. పైగా  టికెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం  అంగీకరించింది. పైగా పెంచే టికెట్ రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయట.  ఇక సాహో టీమ్ అదనపు షోస్ కోసం, టిక్కెట్ ధర పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం అందించిన సంగతి తెలిసిందే. అయితే దీని పై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.  మరి సాహో పరిస్థితి తెలంగాణలో ఎలా మారుతుందో చూడాలి.   సాహోకి 350 కోట్లు ఖర్చుపెట్టారు.  దానికి తగ్గట్లుగానే  ఈ సినిమా థియేటర్స్ రైట్స్ ను అమ్మారు. ఇప్పుడు  ఈ సినిమా సేఫ్ వెంచర్ కావాలంటే దాదాపు 450 కోట్లు థియేటర్స్  నుండి వసూళ్లు చేయాలి.  కాబట్టి సినిమాకి  మొదటి రోజు వచ్చే  టాక్ చాల కీలకం కానుంది. అందుకే పాజిటివ్ టాక్ వచ్చేలా సోషల్ మీడియాని హ్యాండిల్ చేసేలా చిత్రబృందం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.  మరి ఫస్ట్ షో టాక్ ఎలా ఉంటుందో చూడాలి.   


కాగా ప్రస్తుతం సాహో  ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు.  ఇక సాహోలో ప్రభాస్  పాత్ర కొంచెం నెగిటివ్ గా ఉంటుందట. దీనితో సాహో సినిమాలో  ప్రభాస్ రోల్  కొంచెం నెగెటివ్ లక్షణాలు కలిగివుంటాయని ప్రభాసే చెప్పాడు. ఇక  ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు.  టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.  సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ మరియు టి సిరీస్ బ్యానర్స్  పై వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: