బిగ్ బాస్ సీజన్ 3 లో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఐదు వారాలు పూర్తికావడంతో ఐదుగురు హౌస్ మేట్స్ ఇంట్లో నుండి బయటకి వెళ్లిపోయారు. అలాగే ఆరోవారం నామినేషన్స్ ని కూడా బిగ్ బాస్ నిర్వహించారు. ఈ నామినేషన్స్ లోభాగంగా ముందుగా మహేష్ , హిమజ , పునర్నవి , వరుణ్ , రవి , రాహుల్ లు నామినేట్ అయ్యారు. వరుణ్ ని కెప్టెన్ పవర్ తో శివజ్యోతి డైరెక్ట్ గా నామినేట్ చేసింది.రాహుల్ అయితే వరుసగా ఆరోసారి కూడా నామినేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటువంటి సమయంలో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిని యాక్టీవిటీ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్.  

నామినేట్ అయిన ఆరుగురిలో  ముగ్గురు.. మిగిలిన మరో ముగ్గురిని ఒప్పించి వారు రిస్క్ తీసుకొంటే.. మరో ముగ్గురు సేఫ్ అవ్వడానికి గేమ్ ఆడాల్సి ఉంటుంది అని  సూచించాడు. ఆ క్రమంలో మహేష్, పునర్నవి, హిమజను రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్ ఒప్పించి వారు సేఫ్ అయ్యేందుకు సీక్రెట్ టాస్క్ ఆడటానికి సిద్ధమైయ్యారు.  
ముందుగా మహేష్ వరుణ్  కోసం నేను నామినేషన్స్ లోనే ఉంటాను అని చెప్పాడు. ఏ రాహుల్ కోసం పునర్నవి నేను నామినేషన్స్ లో ఉంటాను అని చెప్పింది, కానీ , హిమజ , రవి మధ్య కాసేపు మాటలు నడిచాయి. 

ఆ తరువాత హిమజ నామినేషన్స్ లో ఉండటానికి ఒప్పుకోవడంతో మిగిలిన ముగ్గురికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఫస్ట్ రవికృష్ణను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి  కొన్ని ఆఫ్షన్ ఇచ్చి అందులో నుండి ఏవైనా రెండింటిని ఎంచు కోవాలని చెప్పాడు. అందులో ఒకటి ఇంటి సభ్యుల్లో ఒకరి తలపై షేవింగ్ ఫోమ్ కొట్టాలి. రెండోది ఒకరి బెడ్‌ను వాటర్‌తో పూర్తిగా తడపాలి. అ రెండు పూర్తి చేస్తే నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు అని బిగ్ బాస్ తెలిపాడు. ఇక సీక్రెట్ టాస్క్ మొదలుపెట్టిన రవి ఒక్కసారిగా ఫోమ్ బాటిల్ తీసుకోని వితిక పై రెచ్చిపోయాడు. అలాగే  కెప్టెన్ శివజ్యోతి బెడ్‌ను వాటర్‌తో పూర్తిగా తడిపేసాడు.  

ఇక రెండో కంటెస్టెంట్ అయిన  రాహుల్‌ను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి  ఒకరిని రెచ్చగొట్టడం ద్వారా కోపం తెప్పించి , ఆ కంటెస్టెంట్ మళ్ళీ తిరిగి తిట్టేలా చేయాలి అని చెప్పాడు. అలాగే  రెండోది వరుణ్, వితిక హార్ట్ పిల్లోను ముక్కలు ముక్కలుగా చేయాలి అని చెప్పాడు. రాహుల్ గేమ్ లో  భాగంగా అలీని రెచ్చగొట్టి కోపం తెప్పించేందుకు ప్రయత్నించాడు ... అలీ ఏ చిన్న విషయానికైనా రెచ్చిపోయే తత్వం కావడంతో రెచ్చిపోయాడు. వీరి మధ్యలో దూరిన శివజ్యోతిని కూడా రాహుల్ నోరుమూసుకుని ని పని చుస్కో అంటూ చెప్పాడు. అలాగే శ్రీముఖి తో కూడా మరోసారి చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఇక వరుణ్ సందేశ్‌కు ఒకటి వితికకు ఇష్టమైన డ్రస్‌ను ముక్కలు ముక్కలుగా చేయాలి అని ,  రెండోది కాఫీ కప్పును వితిక ముఖంపై కొట్టాలి అని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో వితికతో వరుణ్ సందేశ్‌కు మధ్య తీవ్ర స్థాయిలో  గొడవ జరిగింది.   ఒక్కోసారి ఏం జరుగుతుందో అర్దం కాని పరిస్థితిని ఎదుర్కొన్నది. చివరికి కోపంతో రాత్రికి రా నీ సంగతి చెబుతా అని.. బయటకు వెళ్లిన తర్వాత నీ సంగతి చెబుతా అని వరుణ్‌ను వితిక హెచ్చరించింది. ఇక ముగ్గురికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లని సరిగ్గా పూర్తి చేయడంతో బిగ్ బాస్ ఈ ముగ్గురిని ఈ వారం నామినేషన్స్ నుండి బయటపడేసాడు. దీనితో ఈ వారం నామినేషన్స్ లో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు.


మరింత సమాచారం తెలుసుకోండి: