బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 37 ఎపిసోడ్‌లను ముగించుకుని 38వ ఎపిసోడ్‌లోకి అడుగు పెట్టింది.ఈ సందర్భంలో బిగ్ బాస్ షో లో ఈవారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులు రాహుల్,రవికృష్ణ,వరుణ్ సందేశ్, మహేష్ విట్టా,పునర్నవి,హిమజలను యాక్టివిటీ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ కోరారు.ఈ ఆరుగురిలో ముగ్గురు ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండటానికి బిగ్ బాస్ ఒక డీల్‌ ఇచ్చారు.ఇక మీలో మీరే కొట్టుకు చావండి అని ఆ ఆరుగురు సభ్యు లను యాక్టివిటీ ఏరియాలో వదిలేసి,ఆరుగురిలో సేఫ్ కావాల్సిన ముగ్గురు ఎవరో మీలో మీరే తేల్చుకోండని చెప్పారు.



ఇక ఈ సందర్భంలో తన ఛాలెంజ్ పూర్తిచేయడంలో భాగంగా రాహుల్ మరోసారి ఇంటిలో ఫాల్తు మాటలు మాట్లాడాడు.చాలా కూల్‌గానే ఆడుతున్నట్టు కనిపించిన రాహుల్.. హిమజ పై ఓవరాక్షన్‌‌తో నోరు జారాడు.బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజుల్లో రాహుల్ ఎంపిక చేసుకున్న రెండు ప్రాపర్టీస్..1.ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి వారితో గొడవ పడాలి 2.వరుణ్ మరియు వితిక హార్ట్ షేప్ కుషన్‌ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో విసరాలి.వీటిలో మొదటిగా హార్ట్ షేప్ కుషన్‌ను కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో వేసిన రాహుల్ కు తర్వాత అలీ,శ్రీముఖి,వితిక,శివజ్యోతి,బాబా భాస్కర్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. రాహుల్‌ని కదలనివ్వకుండా వీరు అడ్డుపడ్డారు.



దీంతో వారిని రాహుల్ నెట్టే ప్రయత్నంలో శ్రీముఖిని ఒకసారి బలంగా నెట్టాడు.వెంటనే ఆగ్రహం తెచ్చుకున్న శ్రీముఖి,రాహుల్‌ పై కలబడింది.ఆ తరవాత అందరినీ ఒకేసారి నెట్టే ప్రయత్నం చేయడంతో హిమజ కాస్త ఓవరాక్షన్ చేసింది.వితికాను ఎందుకు నెట్టుతున్నావంటూ అరుచుకుంటూ మీద పడడంతో‘‘పిచ్చి మెంటలా నీకు..ఫాల్తు మొఖం దానా’’అంటూ రాహుల్ నోరు జారి అన్నాడు.వెంటనే రాహుల్ మీదుకి దూసుకెళ్లిన హిమజ..‘‘మొహం పగులుద్ది,..చెప్పుతెగుద్ది బేవార్స్ అంటూ ఊగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: