ఇండియా అంతా సాహో ఫీవర్ తో మునిగిపోయింది. సినిమా ప్రమోషన్ చేస్తూ ప్రభాస్ దేశమంతా చుట్టేస్తున్నాడు. ప్రతి చోటా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాను బూస్టప్ చేస్తున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మల్లూవుడ్.. అంటూ తేడాల్లేకుండా తిరిగేస్తూ సాహో మ్యానియాను క్రియేట్ చేస్తున్నాడు. ఎక్కడికెళ్లినా ఒకటే ప్రశ్న. మీకిష్టమైన నటీనటులెవరని. తనదైన స్టైల్లో ప్రభాస్ సమాధానాలిస్తున్నాడు.

 


తాజాగా కోలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న ప్రభాస్ సహజంగానే మీడియా పలు రకాల ప్రశ్నలు సంధించాయి. తమిళ్ లో మీ ఫేవరేట్ హీరో, హీరోయిన్ ఎవరు అని. హీరోల్లో రజినీకాంత్ అంటే అభిమానమని చెప్పాడు. ఎంత ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఆయనకు సాధ్యమని అన్నాడు. హీరోయిన్లలో నయనతార అంటే ఇష్టమని చెప్పాడు. నయనతార స్క్రీన్ ప్రెసెన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. హీరోయిన్ గా చేస్తూ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించటమంటే మామూలు విషయం కాదని చక్కటి అభినయం ఆమె సొంతమని పొగిడేశాడు. తెలుగులో నయనతారతో కలిసి ప్రభాస్ 2007లో యోగి సినిమాలో కలిసి నటించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది.

 


సాహో ప్రమోషన్ బాధ్యత మొత్తం ప్రభాస్ తన భుజాలకెత్తుకున్నాడు. బాహుబలితో వచ్చిన ఇమేజ్ తో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. తర్వాతి సినిమా సాహో కూడా పాన్ ఇండియా కథతో భారీ బడ్జెట్ పెట్టారు. దీంతో ప్రతిచోటా ప్రభాస్ కు ఆదరణ దక్కుతోంది. నిన్న జైపూర్ లో సినిమా ప్రమోషన్ కు వెళ్తూ ఫ్లైట్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఎక్కడికెళ్లినా మీడియా అడిగేవాటికి ఓపికగా సమాధానాలిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో విడుదలకానున్న సాహో ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: