భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అలా ఎదిగినవారిలో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ప్రత్యేకం. రొమాంటిక్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ ఎన్నో హిట్లు ఇచ్చాడు. సల్మాన్ సినిమాల్లోకి వచ్చి 31 ఏళ్లవుతున్న సందర్భంగా తన జ్ఞాపకాలను పంచుకుంటూ ‘ఈ 31 ఏళ్ల నా సినీ కెరీర్ లో నన్ను ఆశీర్వదించిన సినిమా ఇండస్ట్రీకి, నన్ను అభిమానించి నన్నింతటి వాడిని చేసిన అభిమానులకు నా కృతజ్ఞతలు’ అంటూ తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు.

బీవీ హో తో ఐసీ.. అనే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ ద్వారా 1988లో సినిమాల్లోకి ఎంటరయ్యాడు. తన రెండో సినిమా 1989లో రాజశ్రీ ప్రొడక్షన్స్ తీసిన మైనే ప్యార్ కియాతో దేశం దృష్టిని ఆకర్షించి స్టార్ స్టేటస్ పొందాడు. ఈ సినిమా అప్పట్లో 50కోట్లు వసూలు చేసి ఆల్ టైం నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. సల్మాన్-భాగ్యశ్రీ జంట ప్రేక్షకులను కనువిందు చేసింది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అక్కడినుంచి ఈ 31ఏళ్ల సినీ కెరీర్లో సూపర్ స్టార్ గా ఎదిగాడు సల్మాన్. ఇప్పటికీ ఏ కొత్త సినిమా సైన్ చేసినా సంతకం కంటే ముందు ‘రాజశ్రీ సంస్థ నుంచి ఆఫర్ వస్తే మాత్రం ఈ సినిమా వదిలి వెళ్లిపోతాను’ అని రాసి తన అభిమానాన్ని చాటుకుంటాడట.

ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలతో పాటు మరోన్నో వివాదాల్లోనూ ఇరుక్కున్నాడు ఈ బ్రహ్మచారి. కృష్ణ జింకల వేట కేసు, ఐశ్వర్య రాయ్ తో ప్రేమ, కత్రినా కైఫ్ తో ప్రేమ.. ఇలా ఏదీ కలిసిరాలేదు. ఇప్పటికీ మంచి ఫిట్ నెస్ తో, సూపర్ హిట్స్ తో హిందీ చిత్రసీమలో సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు సల్మాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: