మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ ప్రభాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తనతో నటించిన చాలామంది హీరోయిన్స్ ప్రవర్తన పై కామెంట్స్ చేసాడు. ముఖ్యంగా కాజల్ అనుష్కల మధ్య గల తేడాను వివరిస్తూ ప్రభాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 

కాజల్ తో తాను నటించిన సినిమాల విషయాలను గుర్తుకు చేసుకుంటూ కాజల్ ఎనర్జీ లెవల్స్ చాల షాకింగ్ గా ఉంటాయని ఆమెతో తాను నటిస్తున్నప్పుడు ఆమెతో సమానంగా తన ఎనర్జీ లెవల్స్ కూడ పెంచుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే కాజల్ కు డ్రెసింగ్ సెన్స్ తక్కువ అని చెపుతూ షూటింగ్ లేని సమయంలో ఆమె పెద్దగా తన గ్లామర్ గురించి పట్టించుకోదు అంటూ జోక్ చేసాడు.

అయితే అనుష్క దీనికి చాల భిన్నమని చెపుతూ సినిమా షూటింగ్ సమయంలోనే కాకుండా సినిమా షూటింగ్ లేనప్పుడు కూడ చాల నీట్ గా ఉండటానికి ప్రయత్నిస్తుందని అంటూ అయితే అనుష్క మూడ్స్ ను తట్టుకోవడం కష్టం అంటూ జోక్ చేసాడు. అంతేకాదు ఒకొక్కసారి తాను ఆమెకు కాల్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె ఆ కాల్స్ కు స్పందించదని చెపుతూ అనుష్క మూడ్స్ తట్టుకోవడం కష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

‘సాహో’ ప్రమోషన్ కోసం ప్రభాస్ ఇస్తున్న అన్ని ఇంటర్వ్యూలలోనూ ఎక్కడో అక్కడ అనుష్క ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూలు పూర్తి కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ అనుష్క మూడీ పర్సన్ అంటూ కామెంట్స్ చేసి తనకు అనుష్క అందరిలాగే ఒక హీరోయిన్ మాత్రమే తప్పించి మీడియా అనుకున్నట్లుగా తమ మధ్య ప్రత్యేక బంధం ఏమిలేదు అన్న విషయాన్ని క్లారిటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: