ఆర్ ఎక్స్100  తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సెన్సేషనల్  హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పంజాబీ  బ్యూటీ పాయల్ రాజ్ పుత్.  ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్  వున్న పాత్రలో  బోల్డ్ గా నటించి  ఇండస్ట్రీ లో అప్పట్లో సంచలనం రేపింది పాయల్.  ఇక ఈ సినిమా తరువాత ఎప్పటికప్పుడు  హాట్ ఫోటో షూట్ లలో పాల్గొనడం .. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో  వైరల్ అవ్వడంతో  పాయల్ కు ప్రస్తుతం వరసగా  అవకాశాలు వస్తున్నాయి. అయితే  ఫోటో లో హాట్ గా కనిపించినంత మాత్రాన  నెన్నంటికీ అందుబాటులో ఉంటానని కాదని  పాయల్  తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది.  కేవలం పాత్ర కు అవసరం అయ్యేలా మాత్రమే నటిస్తాను కానీ బయట నేను అలా ఉండను. చాలా సింపుల్ గా వుంటాను .. ఆర్ ఎక్స్ 100 తరువాత ఇప్పటికీ సెట్ లో నన్ను కలవడానికి చాలా మంది భయపడతారు. 





ఇక ప్రజలు  ఇంకా నన్ను ఎందుకు ఓకే కోణంలో చూస్తున్నారో నాకుఅర్ధం కావడం లేదు. సినిమాల కోసం  నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని మాత్రం అనుకోకండి.  ఎప్పటికప్పుడు డిఫ్రెంట్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తాను..  ఆర్ ఎక్స్ 100 తరువాత లైఫ్ మారిపోయింది. తీరికలేని షెడ్యూల్స్ తో బిజీ గా వున్నాను.  అందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో  వెంకీమామ , డిస్కోరాజా , ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలతో పాటు  ఓ లేడీ  ఓరియెంటెడ్ సినిమా లో కూడా నటిస్తున్నాను.  ఇక వీటితో పాటు కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్ సరసన ఓ సినిమా లో నటిస్తున్నాని పాయల్ రాజ్ పుత్  తెలియజేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: