ఒకానొక ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూలు నిర్వహించే శ్వేతారెడ్డి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ మూడవ సీజన్ స్టార్టవకముందు ఆమె చేసిన హంగామా వల్ల ఆమె ఎవరనేది తెలిసిపోయింది. బిగ్ బాస్ నిర్వాహకులు తన పట్ల అన్యాయంగా ప్రవర్తించారంటూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద రచ్చ జరిగింది. షోని నిలిపివేయాలనే ఆమె డిమాండ్ కి  బిగ్ బాస్ నిర్వాహకులు లొంగలేదు.


అయితే ప్రస్తుతం శ్వేతా రెడ్డి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కామెంట్లు చేసింది. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించి క్యాస్ట్ ఫీలింగ్ అనే పాటని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ పాటలో ప్రభాస్ ని లాగడం గమనార్హం. ఈ పాట గురించి, అందులో ప్రభాస్ ని ఎందుకు లాగాడనే దాని గురించి శ్వేతా రెడ్డి ఇలా చెప్పుకొచ్చింది.


ఇప్పటిదాకా వర్మ రిలీజ్ చేసిన రక్తచరిత్ర, వంగవీటి సినిమా పాటల్లోకెల్లా ఈ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ పాట ద్వారా ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎంత కాలుతుందనేది నాకు అర్థమైంది. నా కుటుంబం, నా ఇల్లు, నా వాళ్ళు అన్నప్పుడు నా క్యాస్ట్ అని ఎందుకు చెప్పకూడదు అని పాటలో ఆర్జీవీ చెప్పిన వర్షన్ ఆయనది కాదని నా అభిప్రాయం అని పేర్కొంది శ్వేతా రెడ్డి.


ఇంకా,కులం అంటే ఎవరైతే ఊగి పోతారో అలాంటి వారందరి ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఆర్జీవీ ఈ ట్రిక్ ప్లే చేశాడనేది తన ఫీలింగ్ అని చెప్పింది. ఈ వీడియో మొత్తం చూశాక, ఆయన పళ్ళు కొరుకుతూ చెప్పే విధానం చూస్తుంటే నాకు అర్థమైంది ఒక్కటే.. కులం గురించి ఆర్జీవీ ఒరిజినల్ ఒపీనియన్ ఇది కాదు అని. ఇదంతా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ప్రమోషన్ కోసం ఇదో ట్రిక్ అని శ్వేతా చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ ని లాగడం కూడా ప్రమోషన్లలో ఒక భాగమేనని చెప్పుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: