బాహుబలి ఈ పేరు వింటేనే కలెక్షన్ల సునామి గుర్తుకు వస్తుంది.ఇందులో నటించిన ఆర్టిస్టులకు ఏమోగాని ప్రభాస్ పేరు ఈ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో మార్మోగి పోయింది.ఇక అప్పటినుండి బాహుబలి  2 తర్వాత అతడి గురించి ఏ చిన్న వార్త వినిపించినా ట్రెండ్ అవుతూ వస్తుంది.ప్రభాస్ పెళ్లి, తదుపరి సినిమా..ఇలా ప్రతీది వైరలైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాపై అంచనాలు మామూలు గా లేవు.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో ప్రభాస్‌ రూ.2 వేల కోట్ల దోపిడికి సంబందించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట.అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రభాస్‌ డ్యూయల్ రోల్‌లో కనిపించి అభిమానులను షాకిస్తున్నాడట,అని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, చిత్ర బృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.




ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ నటిస్తుండగా,సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిచింది.నీల్‌నితిన్‌ముఖేష్‌,జాకీ ష్రాఫ్‌,వెన్నెల కిశోర్‌,అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఇదిలా ఉండగా,సాహో సినిమాలో ప్రభాస్ కేరెక్టర్ పేరు అశోక్ చక్రవర్తి అని కూడా తెలుస్తోంది.ఇక పోతే‘సాహో’చిత్రం టికెట్లను అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు..తగిన వివరణ ఇవ్వాలని కోరుతూ,హోంశాఖ ప్రిన్సిపల్‌కార్యదర్శి,విశాఖ పోలీసు కమిషనర్‌,సాహో చిత్ర పంపిణీదారు దిల్‌రాజుతో పాటు,తదితరులకు నోటీసులు జారీచేసిందట.




‘సాహో’ టికెట్ల ధరలను రూ.100, రూ.200, రూ.300లుగా నిర్ణయించి,వసూలుకు సిద్ధమైనవారి ప్రయత్నాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ నిర్మాత నట్టికుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.దీనిపై మంగళవారం జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ ముందు విచారణ జరిగింది.ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది సాహో సినిమా టికెట్ల ధరలు పెంచకుండా ఆదేశించాలని అభ్యర్థించారు...ఇక ఈ సినిమా రిలీజైన తర్వాత పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటుందో లేదోనని ప్రభాస్ ఫ్యాన్స్ బెంగెట్టుకున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: