మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అనేక అంచనాలు ఉన్నాయి.  సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వస్తోంది.  సెన్సార్ టాక్ ప్రకారం సినిమా ప్రభాస్ ను మరో రేంజ్ లోకి తీసుకెళ్తుంది అని అంటున్నారు.  దానికి తగ్గట్టుగానే ప్రచారం   ఊపందుకుంది.  టికెట్స్ కూడా భారీగా అమ్ముడు అవుతున్నాయి.  బాహుబలి తరువాత ఆ రేంజ్ లో టాక్ వస్తోంది.  రిలీజ్ తరువాత కానీ ఏ విషయం తెలియదు.  రేపు అర్ధరాత్రి నుంచే దాదాపుగా సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. 


ఇదిలా ఉంటె, ప్రభాస్ మదిలో ఓ ఆలోచన ఉన్నది.  అది అమలు జరిగితే మాత్రం ఎవరూ ఊహించని విధంగా షాక్ అవుతారు.  అదేమంటే, ఈ సినిమా రిలీజ్ తరువాత సాహో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే.. సాహో కు సీక్వెల్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాడు.  సాహు నిర్మాణానికి రెండేళ్లు సమయం పట్టింది.  అలాంటిది ఇప్పుడు సాహో సినిమాకు సీక్వెల్ అంటే మరో రెండు మూడేళ్ళ సమయం పడుతుంది.  


ఈ సినిమా మాత్రమే కాదు.. ఫ్యూచర్ లో బాహుబలి 3 సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాడు.  బాహుబలి 1, 2 సినిమాల్లో కేవలం అనుకున్న కథ ప్రకారం 60శాతం మాత్రమే తీశారట.  సంపూర్తిగా పూర్తి కావాలంటే బాహుబలి 3 తీయాలి అంటున్నాడు ప్రభాస్.  ఒకవేళ ఆ సినిమా మొదలుపెడితే.. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము.  బాహుబలి, సాహో కోసం దాదాపుగా ఏడేళ్లు కేటాయించారు. 


ఇకపై మాములు సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని చెప్తున్న ప్రభాస్ ఇలా సడెన్ గా షాకింగ్ ఇవ్వడం ఏంటో అర్ధంకావడం లేదు.  సాహో హిట్టయ్యి దానికి సీక్వెల్ చేయాలి అంటే మరో రెండు మూడు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలి.. అలానే, బాహుబలి 3 తీయాలి అంటే అంతే ఖర్చు అవుతుంది.  మొత్తంగా చూసుకుంటే కనీసం రెండింటికి కలిపి ఎలా లేదన్నా రూ. 600 కోట్లు ఖర్చు అవుతుంది.  ఆ స్థాయిలో ఖర్చు చేయాలి అంటే మామూలు విషయం కాదు.  ఖర్చు గురించి కాకాపోయినా దానికి కేటాయించాల్సిన సమయం గురించి కూడా ఆలోచించాలి కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: