చెన్నై సుందరి సమంత ఏమాయచేసావే  సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నిజంగానే అందరిని మాయ చేసింది. మొదటి సినిమాలో క్యూట్ ఎక్సప్రెషన్స్ తో చీరకట్టులో కనిపిస్తే చాలా సంప్రాదయం అనుకున్నారంతా కానీ , అమ్మడు గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయమేమి పట్టలేదు. రెండో సినిమాతో అందాల ఆరబోతకు తెరతీసిన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదే సమయంలో ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలలో నటించింది. అలాగే తన మొదటి చిత్రం హీరో అయిన అక్కినేని నట వారసుడు నాగచైతన్య తో ప్రేమలో పడి ... పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా మారిపోయింది. 


పెళ్లి తరువాత సమంత పూర్తిగా సినిమాలకి దూరం కాబోతుంది అని చాలా వార్తలు వినిపించాయి. కానీ , వాటిని తప్పు అని నిరూపిస్తూ శ్యామ్ పెళ్లి తరువాత వరుస పెట్టి సినిమాలలో నటించింది. పెళ్లి తరువాత నటించిన అన్ని చిత్రాలు కూడా బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలవడంతో పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టింది. అలాగే పెళ్లి తరువాత కూడా ఎక్సపోజింగ్ కి ఏమాత్రం అడ్డుకట్ట వేయకపోవడం తో అక్కినేని అభిమానుల ఆగ్రహానికి చాలా సార్లు బలైపోయింది. అలాగే తాజాగా మరోసారి సమంత చిక్కింది. నాకు నచ్చిందే చేస్తా ..ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ముందుకు సాగిపోతుంది.


తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హాట్‌ ఫొటో ని  పోస్ట్‌ చేసింది. ఒక  చిన్ని కాస్టూమ్‌లో సమంత  హాట్  హాట్‌గా అందులో దర్శనం ఇచ్చింది. స్పెయిన్‌లో చైతన్యతో కలిసి హాలిడే ఎంజాయ్‌ చేస్తోన్న సమంత ఫాన్స్‌కోసం ఈ ఫోటో పోస్ట్‌ చేయడం ఒక ఎత్తు అయితే , ఈ  ఫోటో తీసింది మై హీరో  చైతన్యేనని కూడా తెలిపింది. దీనితో  మామూలుగా సమంతని ఎటాక్‌ చేసే ట్రోలర్స్‌ ఈ పిక్ చూసి చైతూని కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి బట్టలేసుకున్నపుడు ఫోటోలు తీయడమెందుకు, అవి నెట్‌లో పెట్టనివ్వడమెందుకు అని చెప్తున్నారు. మామూలుగానే సామ్ అంటే క్యూట్ అండ్ స్వీట్ అని అందరూ అనుకుంటారు. ఈ సమయంలో  ఈమె ఫొటోలను చూసి షాక్ అవుతున్నారు. అక్కినేని వారింట కాలు పెట్టునపుడు కొంచం పద్దతిగా ఉన్న శ్యామ్ .. భర్తతో కలిసి  గత కొన్ని రోజుల ముందు  ట్రిప్ కి  వెళ్ళినపుడు బికినిలో ఉన్న ఫొటోస్ షేర్ చేసి యువకుల గుండెల్లో కాకపుట్టిన్చింది. మొత్తంగా సమంత ఫొటో చూసిన ఆమె అభిమానులు మాత్రం సమంత మహా హాట్ గురు అంటూ పోస్ట్లు పెడుతున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: