టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. రేనాటి వీరుడు మరియు తొలిసారి స్వాతంత్రోద్యమ పోరాటానికి బీజం వేసిన వ్యక్తయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి అంచనాలున్నాయి. పాన్ ఇండియా అపీల్ తో ఆయా భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు మరింతగా హైప్ తీసుకువచ్చేందుకు దర్శక, నిర్మాతలు రాబోయే రోజుల్లో విరివిగా ప్రమోషన్లు ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 2న గాంధీ మహాత్ముని జయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

అయితే మరోవైపున అదేరోజున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ కు సిద్ధమవుతోన్న మరొక భారీ యాక్షన్ సినిమా వార్. బాలీవుడ్ సూపర్ హీరోస్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు కలిసి జతకడుతున్న ఈ భారీ సినిమాను యాష్ రాజ్ సంస్థ నిర్మిస్తుండగా, బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టీజర్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే నిన్న యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు వీక్షకులు ప్రస్తుతం బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పుడు ఇదే కొంతవరకు సైరా దర్శక, నిర్మాతల్లో ఒకింత భయాన్ని రేపుతోందని, నేడు సినీ వర్గాల్లో వార్తలు పుకారావుతున్నాయి. నిజానికి వార్ సినిమా ఎప్పుడో రిలీజ్ డేట్ ని ప్రకటించింది, అయితే సైరా టీమ్ మాత్రం ఇటీవలే తమ సినిమా విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఇక ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో 'మీ సినిమాతో పాటు హృతిక్, టైగర్ ల వార్ కూడా భారీ స్థాయిలో అదే రోజున రిలీజ్ అవుతోంది కదా, దాని వలన మీ సినిమాకు థియేటర్లు, కలెక్షన్స్ పరంగా కొంత ఇబ్బంది ఎదురూరవుతుందని మీరు భావించడం లేదా', 

అని హిందీలో సైరా ను కొనుగోలు చేసిన నిర్మాతలను ఒక విలేఖరి ప్రశ్నించగా, ముంబై మహానగరంతో పాటు మన దేశంలో థియేటర్స్ కు ఎటువంటి కొరత లేదని, ఆ రోజున రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు బడా క్రేజీ మూవీస్ కావడంతో, ప్రేక్షకుడు ఒకరోజు ఒక సినిమా చూస్తే, మరొకరోజు ఇంకొక సినిమా చూస్తాడు, అది పెద్ద సమస్య కాదంటూ  వారు తేలికగా మాట్లాడడం జరిగింది. అయితే నేడు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తే, పైకి గంభీరంగా కనపడ్డప్పటికీ, హిందీ రిలీజ్ విషయమై నిర్మాత రామ్ చరణ్ సహా సైరా యూనిట్ మొత్తం కొంతం భయాన్ని మాత్రం లోలోపల ఫీల్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం పుకారేనని ఎందుకంటే, ఒకే రోజు రెండు భారీ సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు, భారతీయ సినిమా చరిత్రలో చాలానే ఉన్నాయని, కాబట్టి వార్ సినిమా విషయమై సైరా టీమ్ భయపడుతోందనే వార్తల్లో వాస్తవం లేదని కొందరు సినీ విశ్లేషకులు వాటిని కొట్టిపారేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: