కాజల్ అగర్వాల్ కెరీర్ ప్రస్తుతం పిక్ స్టేజ్ లో వుంది.  వరుసగా  ఆఫర్లను రాబట్టుకుంటూ సౌత్ లో సత్తా చాటుతుంది. ఇటీవల  కోలీవుడ్ లో జయం రవి సరసన కాజల్ , కోమలి అనే సినిమాలో నటించగా ఆచిత్రం ప్రస్తుతం  బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.  ఈ సినిమా తరువాత  ప్రస్తుతం కాజల్, కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 లో నటిస్తుంది. ఇక  శివ డైరెక్షన్ లో సూర్య నటించనున్న 39 వ చిత్రం లోకూడా కాజల్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. 




ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మళ్లీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది కాజల్. జాన్ అబ్రహం , ఇమ్రాన్ హష్మీ హీరోలుగా  సంజయ్ గుప్తా  ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా ను తెరకెక్కిస్తున్నాడు.  ఈచిత్రంలో  జాన్ అబ్రహం కు జోడీగా నటిస్తుంది  కాజల్.  ఇక ఈచిత్రంలో  ఆమె డిఫరెంట్ షేడ్స్  వున్నా పాత్రలో కనిపించనుందట.  అందులో భాగంగా కాజల్ 17ఏళ్ళ  అమ్మాయిగా  , 25 ఏళ్ళ యంగ్ వైఫ్ గా  అలాగే 30ఏళ్ళ స్ట్రాంగ్  మహిళ గా కనిపించనుందట.  ఈరోజే ఈ సినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా కాజల్  ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. 





కాగా కాజల్ ఇంతకుముందు హిందీ లో స్పెషల్ 26, సింగం సినిమాల్లో నటించింది  ఆ రెండు కూడా మంచి విజయాలను సాధించాయి.  ఇక తెలుగు విషయానికి వస్తే  ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అందులో భాగంగా కాజల్ .. కవచం , సీత , రణరంగం  సినిమాల్లో నటించగా ఈ మూడు సినిమాల్లో ఒక్కటీ కూడా విజయాన్ని సాధించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: