ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మళ్లీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది కాజల్. జాన్ అబ్రహం , ఇమ్రాన్ హష్మీ హీరోలుగా సంజయ్ గుప్తా ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా ను తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రంలో జాన్ అబ్రహం కు జోడీగా నటిస్తుంది కాజల్. ఇక ఈచిత్రంలో ఆమె డిఫరెంట్ షేడ్స్ వున్నా పాత్రలో కనిపించనుందట. అందులో భాగంగా కాజల్ 17ఏళ్ళ అమ్మాయిగా , 25 ఏళ్ళ యంగ్ వైఫ్ గా అలాగే 30ఏళ్ళ స్ట్రాంగ్ మహిళ గా కనిపించనుందట. ఈరోజే ఈ సినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా కాజల్ ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
కాగా కాజల్ ఇంతకుముందు హిందీ లో స్పెషల్ 26, సింగం సినిమాల్లో నటించింది ఆ రెండు కూడా మంచి విజయాలను సాధించాయి. ఇక తెలుగు విషయానికి వస్తే ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అందులో భాగంగా కాజల్ .. కవచం , సీత , రణరంగం సినిమాల్లో నటించగా ఈ మూడు సినిమాల్లో ఒక్కటీ కూడా విజయాన్ని సాధించలేదు.