గత కొంత కాలంగా ప్రభాస్ ఎప్పటికైనా రాజకీయాలలోకి వస్తాడని భారతీయ జనతాపార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తాడని వాస్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆవార్తలను ప్రభాస్ కందిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ నోటివెంట ప్రధాని మోడీ ప్రస్తావన రావడమే కాకుండా గతంలో తనకు మోడీ ఇచ్చిన సలహాలను బయటపెట్టాడు. 

2015 ప్రాంతంలో తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రధాని మోడీని కలిసినప్పుడు తాను అప్పట్లో నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా గురించి అనేక వివరాలు అడిగిన సందర్భాన్ని ప్రభాస్ బయట పెట్టాడు. అంతేకాదు అప్పట్లో ప్రధాని మోడీ కొన్ని ముస్లిమ్ దేశాల పేర్లను సూచించి అక్కడి ప్రాంతాలు సినిమా షూటింగ్ లకు ఎంతో అనువుగా ఉంటాయి అని తనకు చెప్పి తన భవిష్యత్ సినిమాల షూటింగ్ ను అక్కడ చేయమని అప్పట్లో మోడీ తనకు సూచించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే ప్రధాని మోడీ సూచించిన ప్రదేశాలలో ‘సాహో’ సినిమా షూటింగ్ ను జరుపుకోలేకపోయామని ఎప్పటికైనా తాను మోడీ తన సినిమాల విషయంలో ఇచ్చిన సలహాలను పాటిస్తాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు ప్రధానమంత్రి పదవిలో ఉండి కూడ తనతో సినిమాల గురించి ఎంతో ఆశక్తిగా మాట్లాడిన మోడీ మంచితనం తనకెంతో స్పూర్తిని ఇచ్చింది అని అంటున్నాడు.

ఇదే సందర్భంలో ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధి ప్రభాస్ తో రాజకీయాల ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు తన మనస్తత్వం రాజకీయాలకు సరిపోదు అంటూ కామెంట్స్ చేసాడు. ఆర్టికల్ 370ను రద్దు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ బాలీవుడ్‌ చిత్రాల షూటింగ్ జమ్ముకశ్మీర్‌ లో జరుపాలని సూచించిన విషయం పై స్పందిస్తూ తాను తన భవిష్యత్ సినిమాల కథను బట్టి తప్పకుండా కాశ్మీర్ లో షూటింగ్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: