భారీ అంచ‌నాల‌తో మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగుతోన్న సాహోకు అదిరిపోయే షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే టిక్కెట్ల రేట్ల పెంపుపై ఏపీలో హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పుడు ఓవ‌ర్సీస్‌లోనూ షాక్ త‌గ‌ల‌నుంది. 
అసలే ఈమధ్య తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పడిపోయిందన్న టాక్ వినిపిస్తుంటే ప్రభాస్ సాహోకి అది మరోసారి ప్రూవ్ అయ్యేలా ఉంది. 


బాహుబ‌లి ఎఫెక్ట్‌తో ఓవర్సీస్ లో సాహోకి భారీ క్రేజ్ ఉంటుందని ఊహించగా ఆశించిన స్థాయిలో అక్కడ క్రేజ్ దక్కలేదు. దీనితోడు భారీ రేంజ్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేసినా టికెట్స్ మాత్రం పెద్దగా సేల్ అవట్లేదని తెలుస్తుంది. దీనికి కారణం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అని తెలుస్తోంది. వాస్త‌వంగా చూస్తే సాహోకు ఓవ‌ర్సీస్‌లో భారీ ఎత్తున ప్రీమియ‌ర్లు ప్లాన్ చేశారు. అయితే అక్క‌డ ప్రీమియ‌ర్లు ప్లాన్ చేసిన రేంజ్‌లో ప్ర‌మోష‌న్లు చేయ‌లేద‌న్న టాక్ వ‌చ్చింది.


ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ క్రాస్ చేయాలనుకున్న మేకర్స్ ప్లాన్ కు గండి పడేలా ఉంది. ప్రభాస్ కేవలం బాలీవుడ్ ప్రమోషన్స్ మీదనే దృష్టి పెట్టి ఓవర్సీస్ ప్ర‌మోష‌న్‌ను బాగా లైట్ తీసుకున్నాడు. కనీసం ఒకసారైనా సరే అక్కడ సినిమా ప్రమోట్ చేసి ఉంటే పరిస్థితి బాగుండేదని అంటున్నారు. అలాగే ఓవ‌ర్సీస్‌లో సాహో తెలుగు వెర్ష‌న్ ప్రీమియ‌ర్ల‌కు టిక్కెట్ల రేట్లు బాగా పెంచేశార‌ట‌.


ఈ ప్ర‌భావంతో చాలా మంది ప్రీమియ‌ర్లు చూసేందుకు కాస్త వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా టాక్‌ను బ‌ట్టి త‌ర్వాత వెళ్లొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. తమిళ, హింది వర్షన్ సినిమాలకు నార్మల్ టికెట్ ప్రైజ్ ఉంచారట. ఇది కూడా కలక్షన్స్ షేర్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 
ఇక తెలుగు వెర్ష‌న్ మొద‌టి రోజు రూ.100 కోట్లు కొల్ల‌గొడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: