టాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు కెరీర్ బిగినింగ్ నుంచి అక్కా, చెల్లి పాత్రల్లో నటించిన ప్రస్తుతం తల్లి, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తున్నారు.  అలాంటి వారి లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 'సుధ'కి మంచి పేరు వుంది. తల్లిగా, అక్కగా, వదినగా ఆమె ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఇంతకుముందు’, ‘ఆమె’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలను చేశానని.. ఆ పాత్రలు తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయని చెప్పుకొచ్చింది. 

ఇటీవల కాలంలో అలాంటి పాత్రలకు విలువ లేకుండా పోతున్నాయని.. వెక్కిరింతలు, వేలం వెర్రి ఇలా కుటుంబ పెద్దలను నవ్వుల పాలు చేస్తున్న పాత్రలు ఇప్పుడు వస్తున్నాయి.  నాకు అలాంటి పాత్రల్లో నటించడం చాలా కష్టమవుతుంది. ఇటీవల కాలంలో వస్తోన్న పాత్రల్లో ఎలాంటి విషయం ఉండటం లేదు. అందుకే సినిమాల సంఖ్యను తగ్గించేసుకున్నాను. అలా చేసినందుకు నేను అస్సలు బాధపడటం లేదు అన్నారు. 

ఈ మద్య అయితే కొన్ని పాత్రలు మనసు చంపుకొని మరీ నటించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బుకోసమే నటించాల్సి వస్తే నేను చాలా సినిమాల్లో కనిపించేదానిననీ ఆ వ్యామోహం లేదు కనుకనే ఈ మద్య చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నానని అన్నారు సుధ.  అందం అభినయం ఉన్నా తాను మాత్రం మొదటి నుంచి క్యారెర్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతూ గౌరవమైన పాత్రల్లో నటిస్తుంది సుధ. ఒక నటిగా నా సంతృప్తి నాకు ముఖ్యం గనుక, నా మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నాను. చేసిన ప్రతి పాత్ర నన్ను ఒక మెట్టు పైనుంచాలనేదే ఆ కోరి అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: