సినీ ప‌రిశ్ర‌మ‌లో హిట్లు, ఫ్లాప్‌లు స‌హ‌జం. ఒక్కో సారి సూప‌ర్ హిట్ ఇచ్చిన హీరోలు మ‌రోసారి డిజాస్ట‌ర్ ఇస్తుంటారు. అయితే వ‌రుస పెట్టి డిజాస్ట‌ర్ టాక్‌లు వ‌స్తుంటే మాత్రం ఆ హీరో కెరీయ‌ర్ మీద బాగా ఎఫెక్ట్ చూపుతుంటుంది. ఇదే క్ర‌మంలో కొంద‌రు స్టార్ హీరోలు ఇరుకున్నారు. ఈ జాబితాలో ఎక్కువ యంగ్‌ హీరోలే ఉండ‌డం విచిత్రం. మ‌రి ఆ స్టార్ మీరోలు ఎవ‌రు చ‌దివిస్తే పోలా..


అఖిల్ అక్కినేని: `అఖిల్‌` చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మూడు సినిమా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు.


రవితేజ:  మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ర‌వితేజ్ రాజా దీ గ్రేట్‌తో ప‌ట్టాలెక్కాడు అనుకున్నారు. కానీ ఆ త‌ర్వాత వ‌చ్చిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో నిరాశ చెందారు. తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న డిస్కో రాజా చిత్రంలో న‌టిస్తున్నాడు.


గోపీచంద్: ప్రస్తుతం చాణక్య సినిమాతో రెడీగా ఉన్న గోపీచంద్ ఒక‌ప్పుడు మ‌ంచి మెసేజ్, మాస్‌ ఉన్న సినిమాలు చేస్తు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేవాడు. ఆక్సిజన్ - గౌతమ్ నందా - పంతం సినిమాలు అనుకున్న స్టాయిలో రీచ్ అవ్వ‌క‌పోవ‌డంతో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.


మంచు మనోజ్: క‌రెంట్ తీగ త‌ర్వాత ఐదు సినిమాల డిజాస్ట‌ర్ టాక్‌తో హిట్ అన్న విష‌య‌మే మ‌రిచిపోయాడు మ‌నోజ్‌. ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.


శర్వానంద్: శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాలతో స‌క్సెస్ అందుకున్న శ‌ర్వా త‌ర్వాత వ‌చ్చిన రెండు సినిమాలు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు 96 రీమేక్ తో పాటు మ‌రో రెండు సినిమిల‌తో శ‌ర్వా బిజీగా ఉన్నాడు.


రాజ్ తరుణ్: `ఉయ్యాల జంపాల‌`తో కెరీర్ మొద‌లు పెట్టిన‌ రాజ్ త‌రుణ్‌ హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్నాడు. త‌ర్వాత వ‌చ్చిన ఆరు సినిమాలు డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇద్ద‌రి లోకం ఇక‌టే అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.


నితిన్: లై, ఛ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీ‌నివాస క‌ళ్యానం వ‌రుస‌గా మూడు సినిమాలో డిజాస్ట‌ర్స్ అవ్వ‌డంతో నితిన్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇక ప్ర‌స్తుతం రంగ్ దే - భీష్మా అనే డిఫరెంట్ సినిమాలో న‌టిస్తున్నాడు.


అల్లరి నరేష్: న‌రేష్ సుడిగాడు త‌ర్వాత దాదాపు ప‌ది సినిమాలు డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చిన మ‌హిర్షి చిత్రంలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌లో చేసిన న‌రేష్ ఓకే అనిపించుకున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న న‌రేష్ బంగారు బుల్లోడు చిత్రంలో న‌టిస్తున్నాడు.


ఆది: థిల్ల‌ర్, డిఫ‌రెంట్‌ సినిమాల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్న ఆది వ‌రుస‌గా ఎనిమిది సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ప్రస్తుతం జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమాల్లో న‌టిస్తున్నాడు.


అల్లు శిరీష్: ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో `శ్రీ రస్తు శుభమస్తు` చిత్రం ప‌ర్వాలేద‌నిపించుకున్న అల్లు శిరీష్ ఆ త‌ర్వాత వ‌చ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు  డైరెక్టర్ రమేష్ వర్మతో ఓ సినిమా సెట్ చేసుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: