యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో నామస్మరణతో ఆలిండియా ఊగిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లు అన్నిటిలో 90 శాతం మల్టీప్లెక్స్లో సాహో రిలీజ్ అవుతుంది అంటే సాహో హంగామా క‌శ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా సాహో నామస్మరణతో ఇండియన్ సినిమా ల‌వ‌ర్స్ ఊగిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే భారతదేశంలో సాహో హంగామా ప్రారంభం అవుతోంది. 


అమెరికాలో మాత్రం భారత కాలమానంతో పోలిస్తే ఒక రోజు ముందుగానే అంటే గురువారమే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. బుక్ మై షో లాంటి టికెట్ యాప్‌ల‌లో బాలీవుడ్ స్టార్ హీరోలుగా చెప్పుకునే ఖాన్ల‌ సినిమాలకే మూడు నాలుగు లక్షల లైక్స్ వస్తే గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది సాహో ఐదులక్షల లైక్స్‌తో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సాహో క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు. 


ఇక తమిళనాడు రాజధాని చెన్నై , కర్ణాటక రాజధాని బెంగళూరు, కేరళలోని నగరాల్లోనూ సాహూ ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నారంటే ఈ సినిమా ఎలా ఉందో ? తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ప్రభాస్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలో సాహో హంగామా ఇంకా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


ప్ర‌భాస్ సొంతూరు న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్తూరు అయినా ప్ర‌భాస్‌కు భీమ‌వ‌రంతో అనుబంధం బాగా ఎక్కువ‌. రాజుల రాజ‌ధానిగా ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంలో సాహో ఫీవ‌ర్ ఇంకా ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ రోజు అక్క‌డ ఉన్న మ‌ల్టీఫ్లెక్స్‌లోని నాలుగు స్క్రీన్ల‌తో పాటు అన్ని థియేట‌ర్ల‌లోనూ సాహోనే ప్ర‌ద‌ర్శిస్తున్నారు.


భీమవరంలో ఎర్లీ మార్నింగ్ షోకి టికెట్ రేటు ఒక్కోచోట మూడువేలు పలుకుతోంది. భీమ‌వ‌రం ప‌ట్ట‌ణం నిండా భారీ క‌టౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ కలిపి రూ. 19 కోట్లకు విక్రయించారు. రెండుజిల్లాల్లో తొలిరోజు షేర్ ఏ మేరకు వుంటుందన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: