సాహో తరువాత విడుదలకానున్న  భారీ బడ్జెట్  సినిమా సైరా... ఈరెండు తెలుగు సినిమాలైనా  అన్ని భాషల్లో  విడుదలకానున్నడంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది.  ఇక సాహో మరికొన్ని గంటల్లో  థియేటర్లలోకి రానుంది.  బాహుబలి ప్రభావం ఈసినిమా ఫై చాలా పడింది.  అందుకే తెలుగులో ఎంత క్రేజ్ ఉందో దాదాపు హిందీలో కూడా అంతే హైప్ వుంది.  ఇక సైరా విషయానికి వస్తే ఈసినిమా ను ప్రముఖ నిర్మాతలు అనిల్ తడానీ , ఫర్హాన్ అక్తర్ లు హిందీలో విడుదల చేస్తుండడంతో సినిమాకు మంచి బజ్ వచ్చింది.  ఇటీవల ఈ చిత్రం కోసం  ముంబై లో ఈవెంట్ ఏర్పాటు చేసి  సైరా టీజర్ ను అన్ని ప్రముఖ భాషల్లో విడుదలచేశారు.  ఇక టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది టీజర్ లోనే   సైరా అక్టోబర్ 2 విడుదలకానుందని రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 



అయితే బాలీవుడ్ హీరోలు  హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ నటిస్తున్న వార్ సినిమా  కూడా అదే రోజు విడుదలకానుంది.  నిన్న ఈ సినిమా టీజర్ విడుదలైయింది.  ఇక హిందీ సినిమా కాబట్టి వార్ కు  అక్కడ హైప్ మాములుగా ఉండదు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే హిందీ లో సైరా కే దెబ్బ పడుతుంది.  అయితే వార్ తో బాక్సాఫీస్ వార్ ను తప్పించుకోవడానికి  సైరా ను వాయిదా వేస్తున్నట్లు  ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా అక్టోబర్ 8న సైరా ను విడుదలచేయనున్నట్లు గా పుకార్లు వస్తున్నాయి. 



అయితే  ఎట్టిపరిస్థితుల్లో  అక్టోబర్ 2 నే సినిమా థియేటర్లలోకి తీసుకోరావాలని పట్టు బట్టి కుర్చున్నాడట రామ్ చరణ్.  దాంతో  సైరా ను వాయిదా వేసే ప్రసక్తే  లేదని    ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి .  ఒకవేళ సైరా హిందీ డిస్ట్రిబ్యూటర్లు  చరణ్ ఫై ఒత్తిడి తెస్తే మాత్రం సైరా  వెనక్కి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: