అక్కినేని అందగాడు నాగార్జునకు అరవయ్యేళ్ళు నిండాయి. నాగార్జున ఇప్పటికీ టాలీవుడ్ మన్మధుడే. ఆయన అందం అలాంటిది. ఆయన కొడుకు, సినీ హీరో నాగ చైతన్య అన్నట్లుగా నాగార్జునకు వయసు అన్నది ఒక టెక్నికల్  వర్డ్ మాత్రమే. అది అలా వచ్చి వెళ్ళిపోతుంది. నాగ్ ఒంటిమీద దాని ప్రభావం ఏ మాత్రం ఉండదు, ఇక మనసు మీద ప్రభావం అంతకంటే ఉండదు, ఎందుకంటే నాగ్ ఎపుడూ పాతికేళ్ళ యువకుడే అక్కడ.


ఇదిలా ఉండగా నాగార్జున అరవయ్యవ పుట్టిన రోజు వేడుకలను స్పెయిన్ లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. 28వ తేదీ అర్ధరాత్రి నుంచి పుట్టిన రోజు సంబరాలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయట. దీనికి సంబంధించిన డిజైన్ మొత్తం నాగ్ కోడలు సమంతదేనట. మామ గారి బర్త్ డే అదిరిపోవాలని సమంత తన భర్త  నాగ చైతన్యతో వారం రోజుల ముందే స్పెయిన్ వెళ్ళి అన్ని ఏర్పాట్లు చకచకా చేసేసిందట.


ఈ వేడుకలు  స్పెయిన్‌లోని రిసార్ట్‌లో జరుగుతున్నాయి.  కేవలం నాగ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉన్న ఈ వేడుకలు పూర్తిగా గ్రాండ్ లెవెల్లో జరుగుతున్నాయని భోట్టా. ఈ వేడుకలలో నాగ్ తెగ హుషార్ చేశారని తెలిసింది. అరవయ్యేళ్ళకు మళ్ళీ యువకుడిగా మారిన నాగ్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారని అంటు న్నారు.


కాగా తన పుట్టిన రోజు వేడుకలను పూర్తి చేసుకుని  నాగార్జున హైదరాబాద్ దిగిన వెంటనే  తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారు. 'మన్మదుడు 2' ఫలితంతో ఆయన నిరాశ పడిన నేపధ్యంలో కొత్త మూవీతో పక్కాగా హిట్ కొట్టాలని రెడీ అవుతున్నారు. సొ ఇది నాగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.  ఈసారి రొమాంటిక్ హీరోగా వస్తాడో లేక యాక్షన్ హీరోగా మారుతాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: