టాలీవుడ్ సినిమా పరిశ్రమకు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్, తొలి సినిమా సూపర్ హిట్ సాధించడం, అలానే హీరోయిన్ గా ఆమె నటన కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో, ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు పెరిగాయి. ఇక మద్య మద్యలో అక్కడక్కడా సినిమాల్లో కొన్ని ప్రత్యేక గీతాల్లో నటిస్తున్న పాయల్, ప్రస్తుతం వెంకటేష్ సరసన వెంకీ మామ, రవితేజ తో కలిసి డిస్కో రాజా సినిమాలతో పాటు, 

ఆర్డీఎక్స్ లవ్ అనే రొమాంటిక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. తేజస్‌ కంచెర్ల హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముమైత్ ఖాన్ ఒక కీలకపాత్రలో నటిస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తరువాత రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాయల్ పోస్టర్లకు ఆమె ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభించింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఆర్ఎక్స్ 100 ని మించి ఉంటుందని, అలానే పాయల్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్ అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు ఉదయం 9గం. 32ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతులున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 

ఆదిత్య మీనన్‌, నాగినీడు, తులసి, ఆమని, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: రామ్‌ మునీశ్‌, కెమెరా:సి.రాంప్రసాద్‌, సంగీతం: రాధాన్, అందిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్, సికె సినిమాస్ బ్యానర్ల పై నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్....!!


మరింత సమాచారం తెలుసుకోండి: