తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందరినో తన కడుపులో పెట్టుకొని ఆశ్రయం ఇచ్చింది. ఈ రంగుల ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అంటే ఎంతో కృషి , పట్టుదల కావాలి. ఎదో ట్రై చేస్తున్నాం వస్తుందిలే అనుకుంటే అరక్షణంలోనే మనకి రావాల్సిన పాత్ర ఇంకొకరు ఎగురేసుకొని వెళ్ళిపోతారు. ఆలా ఒక చిన్న ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నేడు వారు లేకపోతే సినిమానే లేదు అని స్థాయికి కొందరు చేరుకున్నారు. వీరు ఉంటె సినిమాని చూడచ్చు అనే అభిప్రాయం సినీ అభిమానుల్లో కూడా వ్యక్తం అవుతుంది. టాలీవుడ్ లోనే టాప్ బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల గురించి ఇప్పుడు చూద్దాం ....


ప్రకాష్ రాజ్ .... 


టాలీవుడ్ లో ఉన్న విలక్షణమైన నటులలో ప్రకాష్ రాజ్ ముందువరుసలో ఉంటాడు. "నేను మోనార్కున్ని నన్ను ఎవరు మోసం చేయలేరు" అని అయన చెప్పిన డైలాగ్ తెలుగు సినీ అభిమానులు ఎప్పటికి మరచిపోలేరు. ప్రకాష్ రాజ్ చేయనటువంటి పాత్రే లేదు. విలన్ గా , హీరో .హీరోయిన్స్ కి తండ్రిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలైన పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఒకానొక దశలో ప్రకాష్ రాజ్ కాల్షీట్స్ కోసం హీరోలు కూడా ఎదురుచూసేవారు అంటే అయన రేంజ్ ఏ విధంగా ఉందొ అర్తమైపోతుంది. ఇప్పటికి కూడా బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రకాష్ రాజ్ ..ఇంకా మంచి మంచి పాత్రలెన్నో చేయాలనీ కోరుకుందాం...

రావు రమేష్ ....


ప్రముఖ సీనియర్ నటుడు రావు గోపాల్ రావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రావు రమేష్ అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ , ఇండస్ట్రీలో అయన నటనని గుర్తించడం కొంచెం లేట్ అయ్యింది. గమ్యం చిత్రంలో రావు రమేష్  నటించిన నక్సలైట్ పాత్రఎవరు  తన భవిష్యత్తును మార్చింది. ఫోటోగ్రాఫర్ కావాలని ప్రముఖ యూనివర్సీటీ లో ఫోటో గ్రఫీ నేర్చుకున్న రావు రమేష్ ఆ తరువాత అనుకోకుండా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. రావు రమేష్ కొత్తబంగారు లోకం సినిమాలో చేసిన లెక్చరర్ రోల్ ని యువత అంత త్వరగా ఎవరు మరచిపోరు. ప్రస్తుతం ఈయన లేకుండా చాల తక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.

సీనియర్ నరేష్ ...


చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన నరేష్ ఆతరువాత కాలంలో  కామెడీ హీరోగా పలు చిత్రాలలో నటించి నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి పోటీగా నవ్వులు పూయించారు. ఆలా హీరోగా పలు సినిమాలు చేసిన నరేష్ స్వర్గీయ నటి విజయనిర్మల గారి కుమారుడు అయినప్పటికీ ఆమె పేరు ఏనాడూ కూడా సినిమాలో అవకాశం కోసం ఉపయోగించలేదు. తన సొంత ట్యాలెంట్ తోనే ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం హీరో , హీరోయిన్స్ కి బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఈయన  నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: