ప్రభాస్ సాహో  సినిమా రేఫు  రిలీజ్ కాబోతున్నది.  దీనికి  సంబంధించిన ఏర్పాట్లు మొత్తం దాదాపుగా పూర్తయ్యాయి.  ఇప్పటికే టికెట్స్ సేల్స్ కూడా పూర్తయింది.  ఈరోజు అర్ధ రాత్రి నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో సాహో యూనిట్ లో టెన్షన్ మొదలైంది.  ఎలా ఉండబోతుందో.. ఏం జరగబోతుందో అని టెన్షన్ పడుతున్నారు.  


ఇప్పటికే సినిమాకు  పాజిటివ్ వైబ్ క్రియేట్ అయినప్పటికీ ఎక్కడో తెలియని వెలితి కనిపిస్తోంది.  సినిమాకు పాజిటివ్ వైబ్ రావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  అనుకున్న అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అన్నది తెలియడంలేదు.  బాహుబలి రేంజ్ లో ఉండాలని ప్రేక్షకులు  కోరుకుంటున్నారు.  దానికి ఈ సినిమాకు పోలిక  లేదని, రెండింటిని కలిపి చూడొద్దని ఇప్పటికే ఎన్నోసార్లు యూనిట్ చెప్పింది.  


అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం బాహుబలితో పోలుస్తున్నారు.  ఇదే సినిమాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అని భయపడుతున్నారు.  సెన్సార్ టాక్ ప్రకారం సినిమా  బాగుందని అంటున్నారు.  మరి ఈ టాక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  మొదటిసారి ప్రభాస్ ఇలాంటి యాక్షన్ మూవీ చేస్తున్నాడు.  ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా అభివర్ణిస్తున్నారు.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం కొన్ని గంటలు ఓపికపట్టాలసిందే.  


ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.  ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు.. అటు యూనిట్ మొత్తం ఈ సినిమా విషయంలో చాలా కష్టపడింది. ఈ సినిమా నిర్మాణం కోసం రెండేళ్లు తీసుకున్నారు.  దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు.  ఈ మొత్తం తిరిగి రావాలంటే.. సినిమా తప్పకుండా హిట్ కావాలి.  ఆంధ్రప్రదేశ్ లో అదనంగా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.  కానీ, తెలంగాణాలో ఇప్పటి వరకు అలాంటి అనుమతులు ఇచ్చినట్టుగా కనిపించడం  లేదు.  టికెట్స్ మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.  చూద్దాం ఏం జరుగుతుందో.. ఎలా ఉంటుందో...  ఫస్ట్ డే రోజున ఈ మూవీ ఎంత వసూలు చేస్తుంది అనే దానిపైనే అందరి దృష్టి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: