కొన్ని సినిమాల్లో కథ చాలా సింపుల్ గా ఉంటుంది.  కానీ, ఆయా సినిమాల స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ స్క్రీన్ ప్లేనే సినిమాను నడిపిస్తుంది.  విజయం సాధించే దిశగా అడుగులు వేయిస్తుంది.  అలాంటి సినిమాలు చాలా వచ్చాయి.  ఇప్పటికి వస్తూనే ఉన్నాయి.  ఒక్క గంటలో ఏం జరిగింది.. ఒక్కపూటలో ఏం జరిగింది.  ఒక్క రాత్రి ఏం జరిగింది.  


ఆ కారులో ప్రయాణిస్తే ఎలాంటి అనుభవాలు కలుగుతాయి.. వంటి వాటిని బేస్ చేసుకొని సినిమాలు చేస్తుంటారు.  థ్రిల్లింగ్ ను కలిగించే సినిమాలు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయి.  అందుకే అలాంటి సినిమాల కోసం చాలామంది ట్రై చేస్తుంటారు.  అయితే, ఇలాంటి సినిమానే ఒకటి రాబోతున్నది.  అదే ఖాలీ పీలీ సినిమా.  దఢక్ సినిమాతో మంచి పేరు  తెచ్చుకున్న ఇషాన్ ఖత్తర్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో పేరు తెచ్చుకున్న అనన్య పాండేలు జంటగా నటిస్తున్న ఏ సినిమాను థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తున్నారు.  


ఒక కారు.. ఒక రాత్రి.. ఒక జంట.. ఏం జరిగింది అన్నది కథ.  ఒక రాత్రి కారులో  ప్రయాణిస్తున్న జంటకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.  వాటిని పరిష్కరించుకోవడానికి ఏం చేశారు.  ప్రేమ విషయంలో ఎలాంటి మార్పులు జరిగాయి అన్నది కథ.   బాలీవుడ్లో ఇటీవల కాలంలో థ్రిల్లింగ్  వస్తున్నాయి.  తక్కువ ఖర్చుతో తీసే సినిమాలు  కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నది.  


చాలా తొందరగా ప్రజల్లోకి ఇలాంటి సినిమాలు రీచ్ అవుతుంటాయి.  ఎందుకంటే థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు కోరుకునేది సినిమాలో ఎలాంటి థ్రిల్ ఉందని చూస్తాడు.  ఆ థ్రిల్ ను సినిమాలో   చూపించారా లేదా అన్నది చూస్తాడు అంతే.. అంతకు మించి మరో విషయం ప్రేక్షకులు ఆలోచించరు.  అందుకే ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉండదు.  ఇప్పటికే ఇలాంటి సినిమాలు తెలుగులో బోలెడు  వచ్చాయి.  విజయ్  దేవరకొండ టాక్సీవాలా సినిమా ఇంచుమించుగా ఈ కోవకు చెందిన సినిమానే.  మరి ఖాలీ పీలీ సినిమా ఎలా ఉంటుందో  చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: