గత ఏడాది అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ్త్ హీరోగా తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి, విపరీతమైన ప్రేక్షకాభిమానం మరియు అద్భుత కలెక్షన్స్ తో దూసుకెళ్లిన ఈ సినిమా, ఫైనల్ గా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ గా నటించిన తొలిసినిమానే మంచి విజయాన్ని అందుకోవడంతో, పాయల్ కు టాలీవుడ్ లో అవకాశాలు కూడా రాసాగాయి. ప్రస్తుతం వెంకటేష్ తో వెంకీ మామ, 

రవితేజతో డిస్కో రాజా సినిమాల్లో నటిస్తున్న పాయల్, వాటితో పాటు తేజాస్ హీరోగా శంకర్ భాను దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు సినిమా యూనిట్. 'ఇంట్లో పేరెంట్స్ లేనపుడు మన ఒంట్లో ఫీలింగ్స్ అదుపులో పెట్టుకోవాలి, లేదంటే సేఫ్టీ వాడుకోవాలి' అంటూ పాయల్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ఆరంభం అవుతుంది. మధ్యలో హీరో హీరోయిన్లను, 'రాత్రిపూట ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగగా, 

నా సేఫ్టీ కోసం అతను నాతో వస్తున్నాడు' వంటి డైలాగ్స యూత్ కి కిక్ ఎక్కిస్తాయి. ఇక మధ్యలో హీరో 'నాకు నాలుగు సేఫ్టీలు కావాలి' అని అడగడం, అలానే టీజర్ చివర్లో 'మీరు ఎప్పుడైనా అపరిచిత వ్యక్తితో సెక్స్ చేసారా' అంటూ పాయల్ చెప్పే డైలాగ్ తో ఈ సినిమాను ఎక్కువగా యూత్ ని ఆకట్టుకోవాలని తీసిన ప్రయత్నంగా అనిపిస్తుంది. టీజర్ మొత్తం ఎక్కువగా హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతోనే సాగుతుంది. మొత్తంగా చెప్పాలంటే, ఈ ఆర్డీఎక్స్ లవ్ సినిమా టీజర్, సినిమాపై అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ఆ అంచనాలు ఎంతవర్కౌ అందుకుంటుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: