దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, ఇటీవల ధఢక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే హీరోయిన్ గా నటించిన ఫస్ట్ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించడంతో పాటు నటిగా కూడా గుర్తింపునిచ్చింది. అప్పటినుండి కెరర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న జాన్వీ, ప్రస్తుతం నటిస్తున్న సినిమా గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది జాన్వీ. 

మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్, 1999 కార్గిల్‌ యుద్ధం సమయంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అప్పట్లో అందరి నుండి ప్ర‌శంస‌లు పొందారు. అంతటి సాహసోపేతమైన పని చేసిన ఆమె ధైర్యానికి మెచ్చి, అప్పట్లో ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్ కూడా ఆమెకు అందించడం జరిగింది. అయితే ఆ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళా పైలట్ అయిన గుంజన్ జీవితంలోని ఘటనలు, అలానే ఆ యుద్ధ సమయంలో ఒకేఒక్క మహిళ అయిన ఆమె, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే పలు అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జీ స్టూడియోస్ వారితో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ తండ్రిగా పంక‌జ్  త్రిపాఠి నటిస్తుండగా, నటుడు అంగద్ బేడీ ఆమెకు సోదరుడిగా కనిపించనున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాలో జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ లుక్ ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘కార్గిల్ గర్ల్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం జాన్వీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకోవడం జరిగింది. కెరీర్ తొలినాళ్లలోనే జాన్వీ ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ స్టోరీలో నటించడం నిజంగా ప్రశసించాల్సిన విషయమని ఫ్యాన్స్, సహా పలువురు సినీ విశ్లేషకులు సైతం ఆమెపై ప్రశంశలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చి 13న వరల్డ్ వైడ్ గా గ్రాండ్  లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: