టాలీవుడ్ లో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.  అనీల్ రావిపూడి తో రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.  ఈ సినిమాతో ఇక మాస్ మహరాజా ఈజ్ బ్యాక్ అనుకున్నారు.  కానీ రవితేజ నటించిన నేల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. దాంతో అలర్ట్ అయిన రవితేజ ఈసారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసే హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ ప్రయోగాత్మక మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీ  వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ ‘డిస్కోరాజా’ సోషల్ మీడియాలో క్యూరియాసిటీ పెంచుతుంది.  ఇటీవల రవితేజ సైడ్ ఫోటో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  అంతే కాదు ఈ మూవీలో రవితేజ పాతిక సంవత్సరాల యువకుడిగా కనిపించబోతున్నారట. 

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తితో అభిమానులు వున్నారు.  ఆ మద్య ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ రక రకాల ప్రచారాలు జరిగాయి. దాంతో సినిమాపై ఇక అంచనాలు పెంచడానికి చిత్ర యూనిట్ సిద్దంగా ఉన్నారట.  ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఈ మూవీలో రవితేజ సరసన  పాయల్ రాజ్ పుత్ , నభా నటేశ్ , తాన్యా హోప్ నటిస్తున్నారు. హీరోగా రవితేజ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: