టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తమ కామెడీతో థియేటర్లలోని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.  మరో కామెడీ విషయం ఏంటంటే..తెలుగు లో ఉన్నంత మంది కమెడియన్లు వేరే ఏ సినీ పరిశ్రమలో లేకపోవడం విశేషం. అయితే ఇక్కడ కమెడియన్ల మద్య ఎలాంటి పోటీతత్వం కూడా లేకపోవడం మరో విశేషం.  ఒకప్పుడు రాజబాబు, రేలంగి,పద్మనాభం తర్వాత ఆ స్థాయి కామెడీ పంచింది గిరిబాబు, నూతన్ ప్రసాద్, సుధాకర్.  ఓ వైపు విలన్ పాత్రల్లో నటిస్తూనే తమదైన కామెడీ మార్క్ చాటుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడైన సుధాకర్ ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించారు.  వెరైటీ డైలాగ్స్ తో తనదైన మేనరీజంతో సుధాకర్ అందరినీ కడుపుబ్బా నవ్వించారు.  మెగాస్టార్ చిరంజీవి తో నటించిన సుధాకర్ ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ తో కూడా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ చిరంజీవి తో నాకు మొదటి నుంచి మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఒకే రూమ్ లో ఉండేవాళ్లం.. 'వరప్రసాద్'గా వున్నప్పుడు కూడా ఆయనని నేను చిరంజీవి అనే పిలిచేవాడిని.

ఆ తరువాత అదే ఆయన పేరు కావడం తెరపై కంటిన్యూ కావడం చాలా సంతోషం అనిపించింది. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..చిన్నప్పటి నుంచి తనకు బాగా తెలుస అని..పవన్ ఎప్పుడు మద్రాస్ వచ్చినా తనను తప్పకుండా కలుస్తాడని అన్నారు. అయితే పవన్, నేను కలిసి నటించిన  'సుస్వాగతం' సినిమాలో పవన్ నన్ను 'ఒరేయ్' అని పిలవాల్సి వచ్చింది. 

అసలే పవన్ చాలా మొఖమాటం గల వ్యక్తి...తనను ఒరేయ్ అని పిలవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడని అన్నారు. 'గోకులంలో సీత' సినిమా షూటింగులోను ఇదే పరిస్థితి ఎదురైంది. 'ఫరవాలేదు .. నువ్వు పిలిచేది నన్ను కాదు .. నా పాత్రను అని నేను రిక్వెస్ట్ చేయవలసి వచ్చింది..ఇలా ఆ రెండు సినిమాల్లో పవన్ చాలా ఇబ్బంది పడ్డా సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి అన్నారు సుధాకర్.


మరింత సమాచారం తెలుసుకోండి: