ఒకప్పుడు వెండి తెరపై ఎక్కువగా సావిత్రి, జమున అనే పేర్లు వినిపించేవి.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పేర్లు ఎలాగో హీరోయిన్లు అంటే వెంటనే వీరి పేర్లు తెరపైకి వచ్చేవి.  అంతగా పేరు సంపాదించుకున్న సావిత్రి, జమును లను నిజనీవితంలో అక్కాచెల్లెల్ల ఉండేవారట. సావిత్రికి ఏ చిన్న బాధ వచ్చినా..జమునుతో పంచుకునేవారని ఆమె పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ చివరి సమయంలో మాత్రం తన మనసు విప్పి కొన్ని చెప్పుకోలేక పోయిందని వాపోయింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి జమున మాట్లాడుతూ..తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"జమునకి పొగరెక్కువ .. అహంకారి .. గర్విష్టి అని కొంతమంది అనుకునేవాళ్లు.  అప్పట్లో సత్యభామ పాత్ర నాకోసమే క్రియేట్ చేశారా అన్నంతగా నటించేదాన్ని..ఆ సమయంలో నాకు వచ్చిన పాత్రలు గొప్పింటి అమ్మాయిగా, పొగరుబోతు, గర్విష్టి లాంటి పాత్రలే వచ్చేవి.  దాంతో చాలా మంది నిజ జీవితంలో కూడా జమున అలాగే ఉంటారని మెంటల్ గా ఫిక్స్ అయ్యారని..అలాంటి పాత్రల ప్రభావం కూడా నాపై ఉండొచ్చునేమో అని అప్పట్లో నేను భావించేదాన్ని అన్నారు. అయితే నిజంగానే నేను గర్విష్టినైతే సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలిగే దానినా? 40 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో వున్నాను. కంటిన్యూగా  25 సంవత్సరాల పాటు హీరోయిన్ గా చేశాను.

ఇవన్నీ నాకు పొగరు, గర్వం ఉంటే సాద్యమయ్యేవా అని అన్నారు.  రీల్ లైఫ్ వేరు..రియల్ లైఫ్ వేరు అని..రీల్ లైఫ్ లో ఎంతో మందిని గౌరవిస్తే కాని మనకు మనుగడ ఉండదని అన్నారు.  హీరోయిన్ గా చేస్తోన్న సమయంలో నా శరీరాకృతిలో మార్పులు రావడంగానీ, అవకాశాలు తగ్గడంగాని జరగలేదు. ప్రేక్షకులు నన్ను ఓ అందాల తారగా మాత్రమే చూడటానికి ఇష్టపడ్డారు. ఈ కారణంతోనే నేను సెకండ్ ఇన్నింగ్స్ పాత్రల్లో నటించినా..అత్త పాత్రల్లో ఎక్కువగా నటించలేదని అన్నారు జమున. 


మరింత సమాచారం తెలుసుకోండి: