ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా సాహో.. బాహుబలి తర్వాత అంతకు మించిన రేంజులో రాబోతున్న ఈ సినిమాపై ఇటు సినీ ఇండస్ట్రీలో  ,అటు డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. దీని కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
ఇకపోతే, ఈ సినిమా అత్యంత భారీ మొత్తంతో తెరకెక్కింది. భారీ విజువల్స్, వండర్స్ ఎఫెక్ట్స్ తో రాబోతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు.

ఇంకో విషయమేంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్, మన డార్లింగ్ తో కలిసి స్టెప్పులు వేసింది. మోస్ట్ వాంటెడ్ యాక్షన్ కోణంలో ఈ సినిమా రాబోతుంది. ఆ మాటకొస్తే సినిమా మొదలైనప్పటి నుండి ప్రభాస్ యాక్షన్ చేస్తున్నప్పుడు తీసిన పిక్స్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ కి నమ్మలేని వ్యూస్ తో అందరిని నోర్లు వెళ్ళబెట్టుకొనేలా చేసాయి ఆ యాక్షన్స్. 

కాస్త టైం తీసుకున్న కూడా కంటెంట్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, ట్రైలర్స్, మేకింగ్ వీడియోలుతో సినీ
ఇండస్ట్రీలో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎవరి నోట చూసిన ఒకటే మాట సాహో ఎలా ఉంటుంది అని, ఇకపోతే ఈ సినిమా కోసం మేము కూడా స్పెషల్ గా ఎదురుచూస్తున్నాము అంటూ సినీ సెలెబ్రెటీలు వాళ్ళ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అదే తడువుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమా పై కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు కూడా అందరి నోట్లో నానుతున్నాయి.

ఇంతకీ ఆయనేమన్నాడంటే.. ప్రభాస్ ది నా కులమే.. అందుకే నేను అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని అయన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.ఆర్జీవీ మళ్లీ స్పందిస్తూ భీమవరంలో ఏర్పాటు చేసిన ప్రభాస్ సాహో ఫ్లెక్సిల వీడియోని పోస్ట్ చేస్తూ భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి అంటూ పోస్టు పెట్టాడు. నా కులం నా కులం అని వర్మ సాహో కోసం ఎందుకు ఇంతలా చంకలు గుద్దుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా కూడా రేపు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: