రెబల్ స్టార్ సిని వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు కేవలం ఒక తెలుగు హీరో మాత్రమే కాని తన కేపబిలిటీ ఇది కాదని బాహుబలి తీసి ప్రభాస్ స్టామినా ఏంటో చూపించాడు రాజమౌళి. బాహుబలి సినిమా ప్రభాస్ కాకుండా వేరే హీరో అంటే ఊహించడమే కష్టం.


ఇక బాహుబలితో సంచలనాలు సృష్టించి మరోసారి సాహోతో వాటిని తిరగరాసే పని పెట్టుకున్నాడు ప్రభాస్. సుజిత్ డైరక్షన్ లో సాహోగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఈ సినిమాతో కూడా మరో ప్రభంజనం సృష్టించబోతున్నాడని ఇప్పటికే అర్ధమవుతుంది. ప్రస్తుతం దేశమంతా సాహో ఫీవర్ లో ఉన్నారు.


ఎక్కడ చూసినా ఏం విన్నా సాహో సాహో అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచగా సరిగ్గా ఆడియెన్స్ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటే మాత్రం రికార్డులు కూడా సాహో అనేలా కలక్షన్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పటికే సినిమా మీద ఉన్న ఈ బజ్ చూస్తుంటే ఫస్ట్ డే బాహుబలి రెండు పార్టులను బీట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.


సాహో సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంది. యువి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు. కచ్చితంగా సాహో ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నాడు. సాహోకి స్పెషల్ ఇంట్రెస్ట్ గా బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేశాడు ప్రభాస్. అందుకే హిందిలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. మరి సాహోతో ప్రభాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: