బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రోజుకో విధమైన టాస్క్ లతో , మరింత ఆసక్తిగా సరికొత్తగా ముందుకుపోతుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి అయ్యాయి. అలాగే హౌస్లో నుండి ఐదుగురు హౌస్ మేట్స్ కూడా బయటకి వెళ్లిపోయారు. మొదటివారం హేమ , ఆ తరువాత వరుసగా జాఫర్ , తమన్నా , రోహిణి , ఆశు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసారు. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ముందుగా ఆరుగురు నామినేషన్స్ లోకి రాగ, బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నామినేషన్స్ లో ఉన్న వరుణ్ , రవి , రాహుల్ ముందుగానే సేఫ్ అయ్యారు. 

ఇక ఈ వారం మహేష్ , హిమజ , పునర్నవి నామినేషన్స్ లో ఉండటంతో ఎలిమినేషన్ పై అందరికి ఆసక్తి పెరిగిపోతుంది. ఇక వీరిలో ఈ వారం హౌస్ నుండి బయటకి పోవడానికి హిమజ లేదా మహేష్ కె ఎక్కువ అవకాశం ఉంది. పునర్నవి హౌస్లో ఉంటె ఇంకా కొన్ని గొడవలు , రాహుల్ తో ప్రేమాయణం తో బిగ్ బాస్ కొన్ని రోజులు కాలం గడిపేయచ్చు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా ...చలో ఇండియా అంటే ట్రైన్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో పునర్నవి , రవి కపుల్స్ గా చేయమంటే ...వారిద్దరూ నిజమైన కపుల్స్ గా రెచ్చిపోయారు. ఇక శ్రీముఖి , అలీలు కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోయారు.


ఇక ఈ ట్రైన్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ శ్రీనగర్ , చండీఘడ్ , ముంబై , కోల్ కత్తా కొచ్చిన్ , హైదరాబాద్ ని చుట్టి వచ్చారు. టాస్క్ అయిపోగానే ఈ టాస్క్ లో బెస్ట్ పొర్ఫామెన్స్ ఇచ్చిన ముగ్గురిని అందరూ కలిసి ఎంపిక చేసి బిగ్ బాస్ కి చెప్పండి అంటే ..అందరూ కలిసి బాబా భాస్కర్ , వరుణ్ , రాహుల్ పేర్లని చెప్పారు. దీనితో ఈ ముగ్గురిని బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ప్రకటించాడు. 

ఇక తాజా ప్రోమోని ఒక విశ్లేషిస్తే ..... ప్రోమోలో చూస్తుంటే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులైన రాహుల్ , బాబా భాస్కర్ , వరుణ్ కి మట్టిలో ఉక్కు మనిషి అనే ఒక టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ టాస్క్ లో ముగ్గురు బురదలో పడి కెప్టెన్ గా కావడానికి కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రోమో చూస్తుంటే రాహుల్ , వరుణ్ ఫిక్సింగ్ కి పాల్పడినట్టు ఉన్నారు. వస్తే నాకు రావాలి లేకా నీకు రావాలి అని ..బాబా పై భీకరంగా పోరాడుతున్నారు. ముగ్గురిని కలిపి ఒకే తాడుకి కట్టివేయడం తో బాబా ని ఆ బురదలో పడేసి తొక్కుతున్నారు. మొత్తంగా ఈ ఉక్కుమనిషి టాస్క్ బాబా ప్రాణాల మీదకు వచ్చేలా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: