ఏది బోల్డ్ సినిమా..ఏది బూతు సినిమా? అంటే ఇలాంటి వాటికి కరెక్ట్‌గా డెఫినిషన్లు ఇవ్వడం చాలా కష్టం. అయితే  ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అదేంటంటే ఈ రెండు సినిమాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూడలేం. ఓ హీరో కరువు ప్రాంతానికి పర్మనెంట్ బ్రాండ్ అంబాజిడర్ లా హీరోయిన్ తో డీప్ లిప్ లాక్ తో కనపడుతుంటే దాన్ని ఏ లాజిక్ తో సమర్ధించడానికి చూసినా కూడా కుటుంబ సభ్యులతో కలిసి చూడడం కష్టం.   

అయితే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి క్యాజువల్ 'చూడగలిగే' దాన్ని బోల్డ్ అనుకోవచ్చు.  అదే ఓన్లీ అబ్బాయిల గ్యాంగ్ లేదా ఓన్లీ అమ్మాయిల గ్యాంగ్ చూడగలిగేవి కొన్ని ఉంటాయి. వాటినే బూతు అనుకోవాలి.  ఓన్లీ అబ్బాయిలు అనుకోండి.. అప్పుడు పర్వాలేదు ఎంత బూతైనా ఎలాంటి బూతైనా ఎంతో అందంగా ఉంటుంది. సినిమాల విషయంలో ఇబ్బంది అసలు ఎక్కడ వస్తుంది అంటే లవ్ పేరున బోల్డ్ సీన్లను బోల్డ్ పేరు చెప్పి బూతును ప్రేక్షకులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు.  'ఆర్ ఎక్స్ 100' సినిమాతో బోల్డ్ టాగ్ సాధించిన పాయల్ కొత్త సినిమా 'ఆర్.డి.ఎక్స్. లవ్'. ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. అంతేకాదు ఈ టీజర్ తో పాటు కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేశారు.  వాటిని ఎంతగా 'బోల్డ్' అని సరిపెట్టుకుందామని అనుకున్నా జనాలు ఒప్పుకోవడం లేదు.. బ్యాకెండ్ లో "అది బూతు పెద్ద బూతు బండ బూతు" అని ఎవరో ఒకరు అరిచి గగ్గోలు పెడుతున్నారు. 

టీజర్ రిలీజ్ పోస్టర్ లో పాయల్ అదోరకంగా పడుకుని ఉండడం.. ప్రేక్షకులకు ఒకరకమైన చికాకును తెప్పిస్తుంది. అంతే కాదు ఇదే పోస్టర్ పై ఒక నెటిజన్ చేసిన బెస్ట్ కామెంట్ ఏంటంటే.. "ఆర్.డి.ఎక్స్ లవ్ అనే టైటిల్ కి బదులుగా XXX లవ్ టైటిల్ పెడితే సరిపోయేదిగా?" అని. ఈ కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నిజమే కదా ఒక పక్క బూతు సినిమాలలో నటించిన వాళ్ళు అన్నీ మానుకొని పద్దతిగా సినిమాలు చేసుకుంటుంటే వీళ్ళేమో రివర్స్ లో వెళుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: