వి6లో సూపర్ హిట్ అయిన తీన్మార్ వార్తలతో బాగా ఫేమస్ అయిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి సడెన్ గా అందరికి షాక్ ఇస్తూ టివి 9లో చేరాడు. ఆ విషయాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు కూడా. అయితే టివి 9లో చేరిన తర్వాత మొదటిసారి ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు బిత్తిరి సత్తి.


ఇంతకుముందు పనిచేసిన వి6 ఛానెల్ వారు తనని బాగా చూసుకున్నారని.. కొత్త జర్నీ మొదలైంది.. ఇప్పటివరకు తనని ఆదరించారు.. ఇక మీదట కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు బిత్తిరి సత్తి. అఫిషియల్ గా ఆగష్టు 30 నుండి అక్కడ తన జర్నీ స్టార్ట్ అవుతుందని. ఇకపై ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తానని చెప్పుకొచ్చారు బిత్తిరి సత్తి.


ఓ పక్క శివ జ్యోతి బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా వెళ్లగా.. సడెన్ గా బిత్తిరి సత్తి కూడా వి6ని వదిలి టివి 9లో చేరడం హాట్ న్యూస్ గా మారింది. తనని ఇంతకుముందు చానెల్ వారు తుపాకి రాముడు సినిమా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఆ ప్రోగ్రాం హిట్ అవడానికి తన ఎఫర్ట్ మొత్తం పెట్టానని అన్నారు బిత్తిరి సత్తి. ఛానెల్ యాజమాన్యంతో తన నాలుగున్నర ఏళ్ల ప్రయాణం సాఫీగా సాగిందని అన్నారు.    


అయితే కళాకారులకు కష్టాలు ఉంటాయి. వాటిని దాచుకుని కామెడీని మాత్రమే చూపించాలని అనుకుంటాం కాబట్టి ఎవరు ఏమన్నా సరే మీరు ఇచ్చిన స్థానాన్ని గౌరవిస్తాను.. ఆ స్థానం ఎంతో గొప్పది కాబట్టి దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటా అని చెప్పుకొచ్చారు బిత్తిరి సత్తి. టివి 9లో కొత్తగా కనిపిస్తానని.. కొత్త భాషతో సరికొత్తగా ట్రై చేస్తానని అది కూడా మిమ్మల్ని అలరిస్తుందని అన్నారు బిత్తిరి సత్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: