ప్రభాస్ సాహో మూవీ కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లో ప్రారంభం అయ్యింది.  అయితే, దుబాయ్ లో ఇప్పటికే షోలు ముగిసాయి.  కాగా, దుబాయ్ రిపోర్ట్ ప్రకారం  వచ్చింది. ఇందులో ఇంట్రో సీన్ తోనే సినిమా మరో రేంజ్ కు వెళ్ళింది.  సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే విధంగా ఉన్నాడు ప్రభాస్.  ప్రభాస్ ఇంట్రోనే సాంగ్ తో మొదలైంది.  బ్యాడ్ బాయ్ సాంగ్ తోమూవీ ఎక్కడికో వెళ్లినట్టు తెలుస్తోంది.  


చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే షోలు ముగిశాయి. అయితే, సెక్యూరిటీ ప్రాబ్లెమ్ కారణంగా తెలంగాణాలో అనుమతి ఇవ్వలేదు.  తాజా సమాచారం ప్రకారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నది.  


సినిమా ఎలా ఉన్నది ఏంటి అనే విషయం గురించి ఇప్పటికే ఓ అంచనాలు వచ్చారు. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా బాగుందని అంటున్నారు. పక్కా యాక్షన్ మూవీ కావడంతో ప్రభాస్ ఫైట్స్ నుంచి అన్ని కూడా చాల బాగున్నాయని టాక్ వస్తున్నది.  స్క్రీన్ ప్లే ఎవరూ ఊహించని విధంగా ఉన్నది.   పక్కా యాక్షన్ మూవీ కావడంతో పాటు... ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని సినిమా కావడంతో అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.  


ఓపెనింగ్ ఎంత క్యూరియాసిటీగా ఉన్నదో.. ఇంటర్వెల్ బాంగ్ సినిమాకు ప్రాణం అని అంటున్నారు.  సెకండ్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ పందాల్లో ఉంటుందని అంటున్నారు.  మొత్తానికి ప్రభాస్ మరలా భారీ హిట్ కొట్టాడని టాక్ వస్తున్నది.  ఇక ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉంటాయి.. వీకెండ్ ఏ స్థాయిలో ఉన్నది అనే విషయం తెలియాల్సి ఉన్నది.  మరికా సేపట్లోనే  వెబ్ రివ్యూస్ కూడా వస్తాయి కాబట్టి పూర్తి స్వరూపం తెలిసిపోతుంది.  అయితే సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమాల్లో కనిపించే ఆ ఫన్ అన్నది ఈ సినిమాలో పెద్దగా లేదని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: