సినిమా అనేది ప్రస్తుత బిజీ కాలంలో ఒక మంచి వినోదంగా మారిపోయింది. హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ తో పాటుగా ,వారి గ్లామర్ కూడా సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. అందుకే దర్శకులు సినిమాలో కథతో  పాటు గ్లామర్  కూడా తగిన  విధంగా కలిపి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒకప్పుడు హీరోయిన్ల అందాలను పైపైనే చూపించే వారు. కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. పై పై అందాలతో ప్రేక్షకులు సంతృప్తి పడటం లేదు. అందుకే దర్శకులు కూడా వారి అభిరుచికి తగిన విధంగానే హీరోయిన్ల అందాల ఆరబోతను సినిమాలో భాగం చేసారు. 

ఈ కాలం సినిమాల్లో హీరోయిన్ల బికినీల ప్రదర్శన సాధారణం అయిపోయింది.   తెలుగు సినిమాల్లో బికినీల జోరు తక్కువే అని చెప్పాలి , కానీ ,బాలీవుడ్లో ఈ బికినీ ట్రెండ్ 1958లోనే మొదలైంది. బాలీవుడ్ నటి నూతన్  ఢిల్లీ కా తంగ్  మొట్టమొదటిసారిగా భారతీయ సినిమా తెరపై స్విమ్ సూట్లో మెరిసిపోయింది. ఆ తర్వాత 1967లో షర్మిలా ఠాగూర్ ఆన్ ఈవినింగ్ ఇన్ పారిస్ చిత్రంలో బికినీ వేసి అందరినీ ఆశ్చర్య పరించింది. ఆ తర్వాత బాలీవుడ్లో బికినీ సీన్లు చాలా కామన్ అయిపోయాయి.  
ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో  సెక్సీ ఫిగర్లతో యువకుల గుండెల్లో గుబులు రేవుతున్న టాప్ 3  బికినీ భామల గురించి తెలుసుకుందాం..

దీపిక పదుకోన్ .. 2006లో ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత  2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన చిత్రం ఓం శాంతి ఓం  ద్వారా  బాలీవుడ్లో లోకి అడుగుపెట్టింది. మోడింగ్ రంగంలో బికినీలు వేసిన అనుభవం, సూపర్  సెక్సీ ఫిగర్ ఉండటంతో సినిమాల్లోనూ బికినీలు వేసి శృంగార సన్నివేశాలలో కుమ్మేసింది.  

సన్నీ లియోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పోర్న్ సినిమాల్లో శృంగార రసాన్ని ఒలకపోసిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ .. బికినీలు వేసి తన సెక్సీ ఫిగర్‌తో యువకుల కలల రాణిగా అందరిని ఆకట్టుకుంటోంది.

కత్రినా ... హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా చక్కగా బికినీలో చాలా సెక్సీగా కనిపిస్తుంది. కత్రినా తొలి సినిమా భూమ్  లో నే బికినీ వేసింది. ప్రస్తుతం కత్రినా బాలీవుడ్ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ తన అందాలని ఆరబోస్తుంది. వీరితో పాటుగా ప్రస్తుతం ఎంతమంది బికినీ అందాలతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
  
   


మరింత సమాచారం తెలుసుకోండి: