ఈమధ్య కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏసినిమాకు రాని స్థాయిలో ‘సాహో’ కు భారీ హైప్ వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విడుదలైన ‘సాహో’ ప్రీమియర్ షోల టాక్ వింటూ ఉంటే ఈమూవీ బయ్యర్లు హడిలిపోవడం ఖాయం. ఈసినిమా ప్రీమియర్ షోలను చూస్తూ ఈసినిమా పై అనేకమంది పెడుతున్న నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే ‘సాహో’ పరిస్థితి ఏమిటి అని అనిపించడం సహజం. కథలేని ఈసినిమాకు 350 కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారు అంటూ సగటు ప్రేక్షకుడు తన ట్విట్స్ ద్వారా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. 

ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్ క్లైమాక్స్ తప్ప మిగతా విషయాలు అంతా రొటీన్ మూవీ అంటూ ఒక్క మాటలో ‘సాహో’ ను తేల్చి వేస్తున్నారు. ముఖ్యంగా కథలేని ఈసినిమాకు ఇంత భారీ రన్ టైమ్ పూర్ విఎఫ్ఎక్స్  ఈమూవీకి ఖచ్చితంగా శాపంగా మారే ఆస్కారం ఉంది అంటున్నారు. దీనితో ‘సాహో’ రికార్డుల మాట అటుంచి ఈమూవీ బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు అప్పుడే ప్రాధమీకంగా మొదలయ్యాయి. ‘బాహుబలి’ తో తనకు ఏర్పడ్డ ఒక నేషనల్ స్టార్ ఇమేజ్ ని అనవసరంగా ఒక కథలేని సినిమా కోసం రెండు సంవత్సరాలు కష్టపడి తన విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడా అని ప్రస్తుతం ‘సాహో’ కు వస్తున్న తొలి టాక్ ను బట్టి అనిపిస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ ప్రభాస్ అభిమానులకు అదేవిధంగా మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కు నచ్చుతుంది కాని ఈమూవీ తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టం అన్న టాక్ కూడ వినిపిస్తోంది. ఈమూవీకి వచ్చిన హైక్ రీత్యా ఈరోజు ఈసినిమాకు 70 కోట్ల నెట్ కలక్షన్స్ రావచ్చు కాని ‘బాహుబలి 2’ సినిమాకు వచ్చిన 121 కోట్ల నెట్ కలక్షన్స్ ను క్రాస్ చేయడం కష్టం అన్న అభిప్రాయాన్ని కొందరు ట్రేడ్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఈమూవీ ప్రీమియర్ షో టిక్కెట్ ను 2200 లకు నిర్ణయించినా ఉత్తరాది ప్రేక్షకులు హాట్ కేక్స్ లా కొన్నారు అంటే ఈమూవీకి ఏర్పడ్డ మ్యానియా అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ పై ప్రస్తుతం వస్తున్న నెగిటివ్ టాక్ ను చూస్తుంటే ప్రభాస్ ఈసినిమా ఎంపిక విషయంలో పొరపాటు చేసాడా అని అనిపించడం సహజం అయితే ప్రభాస్ నెగిటివ్ ఫ్యాన్స్ ప్రచారంలోకి తీసుకు వచ్చే కామెంట్స్ కూడ ఉంటాయి అన్న ధైర్యం బయ్యర్లు తెచ్చుకున్నా ‘సాహో’ కి టోటల్ పాజిటివ్ టాక్ రాలేదు అన్న విషయం స్పష్టం. జరుగుతున్న ఈపరిణామాలు ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డ ప్రభాస్ కు ఖచ్చితంగా నిరాశను కలిగిస్తుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.. 




మరింత సమాచారం తెలుసుకోండి: