ప్రభాస్ అంటేనే డార్లింగ్. ఆయన ఓ బాహుబలి. ఆరేళ్ళలో మూడు సినిమాలు చేసినా క్రేజ్  డబుల్ అయింది కానీ ఏ మాత్రం  ఎక్కడా తగ్గడంలేదు. ఇక మిగిలిన హీరోలు టాలీవుడ్ కే పరిమితం అయితే ప్రభాస్ మాత్రం ఆలిండియా లెవెల్ కి ఎదిగారు. ఈ రోజు విడుదలైన సాహోతో హాలీవుడ్ రేంజికి కూడా చేరిపోయారు. ఒక సినిమాను పూర్తిగా తన భుజాల మీద మోయడం అంటే అది చాలా గ్రేట్.


ప్రభాస్ బాహుబలికి ప్రాణం పెట్టారు, సాహోకి తానే అన్నీ అయిపోయారు. ఈ మూవీ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా ఉంది. తెలుగు సినిమాలో ఇప్పటివరకూ రాని ఎపిసోడ్లు ఇందులో  కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే యాక్షన్ మూవీస్ తెలుగులో వచ్చి చాలా కాలం అయింది. అది కూడా హాలీవుడ్ రేంజిలో యాక్షన్ ప్యాక్ అంటే పండుగే మరి.


అందుకే సరిగ్గా గురి చూసి మరీ ప్రభాస్ సాహోతో కొట్టాడు, కొత్త జోనర్లో మూవీని చేయడం ద్వారా ఆయన మంచి పని చేశారనిపించింది. ఇక బాలీవుడు, టాలీవుడ్ సైతం ఈ తరహా మూవీస్ తీయడంలేదు. దాంతో పూర్తిగా ఖాళీగా ఉన్న జోనర్లోకి వెళ్ళి ప్రభాస్ తన సత్తా చాటుకున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీలా ప్రభాస్ ఈ మూవీని మొత్తం అన్నీ తానే అయి నడిపించాడు.


ప్రభాస్ చేసిన సినిమాలు ఒక ఎత్తు ఈ ఒక్క మూవీ మరో ఎత్తు. ఈ మూవీలో ప్రభాస్ కంప్లీట్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దిగ్గజాలాంటి టెక్నీషియన్లను పెట్టుకుని సేఫ్ గేం ఆడాడు. ఓ విధంగా విజువల్ వండర్ గా చెప్పుకుంటున్న సాహో పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. ఈ మూవీ తీయడం ద్వారా టాలీవుడ్లో ఉన్న దమ్ముని ప్రభాస గట్టిగా చాటాడనే చెప్పాలి. మళ్ళీ మళ్లీ తీయడానికి ఎవరూ సాహసించలేనంతగా కంప్లీట్ మూవీగానే సాహోని రెడీ చేసి పెట్టారు. 


సాహో ముందు తరువాత అన్నట్లుగా కూడా టాలీవుడ్ హిస్టరీని మార్చారు. అయితే సాహోలో యాక్షన్ పార్ట్ ఎక్కువ కావడం, సాధారణంగా ఓ మువీలో  ఉండాల్సిన మ్యాజిక్ కొంత మిస్ కావడం ఇబ్బంది అయినా సరే ఈ మూవీ సేఫ్ వెంచరేనని ట్రేడ్ వ‌ర్గాల రిపోర్ట్ గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: