భారత స్టార్ బాడ్మింటర్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతాకాన్ని సాధించి యావత్ భారతదేశం గర్వపడేలా చేసింది. సైనా నెహ్వాల్ తర్వాత ఎవరా అని ఎదురు చూస్తున్న తరుణంలో నేనున్నానంటూ భారత బాడ్మింటన్ చరిత్రని తిరగ రాసింది. సైనా నెహ్వాల్ మించి పోయిన ఈ తెలుగమ్మాయికి బారతదేశం మొత్త నీరాజనాలు పడుతుంది.


గత రెండేళ్లలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు రజతాలు సాధించి ఔరా అనిపించిన సింధు.. ఈ ఏడాది ఏకంగా స్వర్ణమే కొల్లగొట్టింది.రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచినపుడు దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి ఆమె సినిమా తీయడానికి రెడీ అయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. మూడేళ్లుగా స్క్రిప్టు పనులు నడుస్తున్నాయి. కానీ క్లైమాక్స్ విషయంలో ఒక కొలికి రావట్లేదు.


ముందు రియో పతకం దగ్గరే సినిమాను ముగించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. అది పెద్ద ఘనతే. కాబట్టి అక్కడ ముగింపు అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఏకంగా బంగారు పతకం సాధించింది. ఇప్పుడేమో సోనూ మళ్లీ క్లైమాక్స్ మారుస్తున్నామని.. దీన్నే క్లైమాక్స్‌గా చేయబోతున్నామని అన్నాడు. 


కానీ ఈ మ్యాచ్లో ఏమంత డ్రామా లేదు. సింధు పూర్తి ఏకపక్ష విజయం సాధించింది.అలాంటి మ్యాచ్ క్లైమాక్స్ గా తెరకెక్కిస్తే ప్రేక్షకులకి మజా ఉండదు. అదీ గాక నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా ఉంది. ఒలింపిక్స్ లో సింధు స్వర్ణం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే అది ఆ మ్యాచ్ నే క్లైమాక్స్ గా మలిస్తే మరింత బాగా ఉంటుంది. ఒక వేళ సీన్ రివర్స్ అయితే ఏం చేయాలో తెలియదు. దీంతో అసలేం చేయాలో అర్థం కాక ఇరకాటంలో పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: